Dhanush Divorce : ర‌జ‌నీకాంత్ కూతురికి విడాకులు ఇచ్చిన ధ‌నుష్.. 18 ఏళ్ల దాంప‌త్య జీవితానికి స్వ‌స్తి..!

Authored By Sam C | The Telugu News | Updated on: January 18, 2022, 7:50 am

Dhanush Divorce : కొత్త ఏడాదిలో బ్యాడ్ న్యూస్ చెప్పి అభిమానుల‌ని ఆశ్చ‌ర్యానికి గురి చేశారు ధనుష్‌- ఐశ్వ‌ర్య దంప‌తులు. గ‌త ఏడాది స‌మంత‌- నాగ చైత‌న్య అఫీషియ‌ల్‌గా విడాకుల విష‌యాన్ని ప్ర‌క‌టించి కోలుకోలేని షాక్ ఇవ్వ‌గా, ఇప్పుడు ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడిపోవ‌డంపై అంతటా ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది. నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ సినిమా ‘3’ని తెరకెక్కించారు.18 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్న ఈ జంట స‌డెన్‌గా ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల అంద‌రు షాక్ అవుతున్నారు.

18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలు, తల్లిదండ్రులుగా, ఒకరికొకరం సన్నిహితులుగా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. మా మధ్య సన్నిహిత సంబంధాలు, అవగాహన, సర్దుబాట్లు చోటు చేసుకొన్నాయి. కానీ మేము కలిసి జీవించలేమనే పాయింట్‌కు చేరుకొన్నాం. ఐశ్వర్య నేను భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నాం .మా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని, మా ప్రైవసీని అర్ధం చేసుకొంటారని అనుకొంటున్నాను. ఓ నమశ్శివాయ. ప్రేమతో అంటూ ధనుష్ అంటూ పోస్టు పెట్టారు.ఇక ఐశ్వ‌ర్య కూడా త‌న సోష‌ల్ మీడియ‌లో ఇదే పోస్ట్ పెట్టింది.స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం.

Hero dhanush announced divorce with aishwaryaa rajinikanth

Hero dhanush announced divorce with aishwaryaa rajinikanth

Dhanush Divorce : విడాకుల వెనుక నిర్ణ‌యం ఏంటో..

ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి… ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో ఐశ్వ‌ర్య పేర్కొంది. కొన్నాళ్ల క్రితం ర‌జ‌నీకాంత్ మ‌రో కూతురు సౌంద‌ర్య కూడా విడాకులు తీసుకొని పారిశ్రామిక వేత్త విషాగన్ వనంగముడి అనే వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు.

Sam C

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp