Categories: EntertainmentNews

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే… హీరో ధనుష్ , నటి మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తున్న సంబంధం గురించే.. ఇటీవల వీరిద్దరూ కలసి పలు ఈవెంట్‌ల్లో కనిపించడం, సన్నిహితంగా మెలగడం నేపథ్యంలో డేటింగ్ రూమర్స్‌కు మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 1న మృణాల్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సెలబ్రేషన్ ఈ ప్రచారానికి దారితీసింది.

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధ‌నుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైర‌ల్

Mrunal Thakur Dhanush : ఏది నిజం..

బర్త్‌డే పార్టీకి ధనుష్ ప్రత్యేకంగా ముంబైకి విమానంలో వెళ్లడం, పార్టీలో మృణాల్‌తో ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం ఓ వీడియో ద్వారా బయటపడి వైరల్ అయింది. వీడియోలో ధనుష్ మృణాల్ చేతిని పట్టుకుని ఆమెతో క్లోజ్‌గా మాట్లాడిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న అభిప్రాయం బలపడింది. మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్పెషల్ స్క్రీనింగ్‌కు కూడా ధనుష్ హాజరయ్యాడు. అక్కడ వీరిద్దరిని కలసి ఓ వీడియోలో చూడొచ్చు. అందులో మృణాల్ ధనుష్ చెవిలో ఏదో గుసగుసలాడటం నెటిజన్లను మరింత ఉత్సాహపరిచింది.

ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌కు దారితీశాయి. కొంతమంది నెటిజన్లు “వాళ్లు డేటింగ్ చేస్తున్నారని అనిపిస్తోంది” అని వ్యాఖ్యానించగా, మరికొంతమంది “ఇది స్నేహం కావచ్చు, తేల్చడం తొందరపడటం కాదు” అని అంటున్నారు. “నిజమా? నేను నమ్మలేకపోతున్నా” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినవారూ ఉన్నారు. జూలై 3న జరిగిన రచయిత కనికా ధిల్లన్ బర్త్‌డే పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. ఈ పార్టీని ధనుష్ తదుపరి చిత్రం ‘తేరే ఇష్క్ మే’ కోసం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వీరిద్దరూ ఫ్రెండ్లీగా కలిసి ఫోటోలికి పోజులిచ్చారు.

Recent Posts

Viral News : బాల్యవివాహాన్ని ధైర్యంగా ఎదురించిన 13ఏళ్ల బాలిక .. హెడ్‌మాస్టర్‌ సాయంతో పెళ్లి రద్దు..!

Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…

8 minutes ago

KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు నిజాలు కేసీఆర్ బట్టబయలు చేయబోతున్నాడా…?

KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…

1 hour ago

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

3 hours ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

4 hours ago

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

5 hours ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

6 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

7 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

8 hours ago