Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన సమస్యలు వస్తాయా?
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అందరికీ ఇష్టమైన పెరుగు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.పెరుగు ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్‌తో శరీరానికి ఎన్నో లాభాలు కలిగించే ఆహార పదార్థం. అయితే రాత్రిపూట పెరుగు తినడం మాత్రం ఆరోగ్యానికి మేలు చేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన సమస్యలు వస్తాయా?
ఆధునిక వైద్యం మరియు ఆయుర్వేదం రెండూ సూచించేది ఏంటంటే రాత్రి సమయంలో పెరుగు తింటే జీవక్రియ మందగిస్తుంది. ఈ సమయంలో పెరుగు లాంటి కొవ్వు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది.పెరుగు శరీరంలో కఫంపెంచే ఆహారంగా గుర్తించబడింది. జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు అధికమయ్యే అవకాశముంది.
ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, జలుబు ఉన్నవారు రాత్రిపూట పెరుగు పూర్తిగా నివారించాలి. ఉదయం లేదా మధ్యాహ్న భోజన సమయంలో పెరుగు తీసుకుంటే మంచిది. ఇంట్లో తయారుచేసిన తాజా పెరుగు వాడటం ఆరోగ్యానికి ఉత్తమం. పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా పెరుగు తీసుకోవద్దు. అధిక కొలెస్ట్రాల్, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ సమయం, శరీర స్థితిని బట్టి తీసుకోవడం ఎంతో ముఖ్యం. రాత్రిపూట తినాలంటే డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
This website uses cookies.