Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధనుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైరల్
ప్రధానాంశాలు:
Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధనుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైరల్
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే… హీరో ధనుష్ , నటి మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తున్న సంబంధం గురించే.. ఇటీవల వీరిద్దరూ కలసి పలు ఈవెంట్‌ల్లో కనిపించడం, సన్నిహితంగా మెలగడం నేపథ్యంలో డేటింగ్ రూమర్స్‌కు మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 1న మృణాల్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సెలబ్రేషన్ ఈ ప్రచారానికి దారితీసింది.

Mrunal Thakur Dhanush : హాట్ టాపిక్‌గా ధనుష్- మృణాల్ ఠాకూర్ డేటింగ్.. వీడియో వైరల్
Mrunal Thakur Dhanush : ఏది నిజం..
బర్త్‌డే పార్టీకి ధనుష్ ప్రత్యేకంగా ముంబైకి విమానంలో వెళ్లడం, పార్టీలో మృణాల్‌తో ఎంతో ఆత్మీయంగా మాట్లాడటం ఓ వీడియో ద్వారా బయటపడి వైరల్ అయింది. వీడియోలో ధనుష్ మృణాల్ చేతిని పట్టుకుని ఆమెతో క్లోజ్‌గా మాట్లాడిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న అభిప్రాయం బలపడింది. మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్పెషల్ స్క్రీనింగ్‌కు కూడా ధనుష్ హాజరయ్యాడు. అక్కడ వీరిద్దరిని కలసి ఓ వీడియోలో చూడొచ్చు. అందులో మృణాల్ ధనుష్ చెవిలో ఏదో గుసగుసలాడటం నెటిజన్లను మరింత ఉత్సాహపరిచింది.
ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌కు దారితీశాయి. కొంతమంది నెటిజన్లు “వాళ్లు డేటింగ్ చేస్తున్నారని అనిపిస్తోంది” అని వ్యాఖ్యానించగా, మరికొంతమంది “ఇది స్నేహం కావచ్చు, తేల్చడం తొందరపడటం కాదు” అని అంటున్నారు. “నిజమా? నేను నమ్మలేకపోతున్నా” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినవారూ ఉన్నారు. జూలై 3న జరిగిన రచయిత కనికా ధిల్లన్ బర్త్‌డే పార్టీకి కూడా మృణాల్ హాజరయ్యారు. ఈ పార్టీని ధనుష్ తదుపరి చిత్రం ‘తేరే ఇష్క్ మే’ కోసం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వీరిద్దరూ ఫ్రెండ్లీగా కలిసి ఫోటోలికి పోజులిచ్చారు.