dhavala satyam about chiranjeevi marriage
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన యాక్టింగ్ కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగస్టార్ డ్యాన్స్ అంటే ఎంతో మందికి పిచ్చి ఇష్టం. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. అంటూ పలికే ఆ డైలాగ్స్ కి ఫిదా అయిపోతారు. తెలుగు సినిమాలో సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేసిన నటుడు చిరంజీవి. కాగా ఇప్పటికీ మెగాస్టార్ అదే ఊపు అదే ఎనర్జీతో అదరగొడుతున్నారు. శంకర్ దాదా జిందాబాద్ తర్వత కొంత గ్యాప్ ఇచ్చిన చిరు.. ఖైదీ నంబర్ 150 తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అంటూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా ఆచార్య సినిమాలో నక్సలైగా కనిపించి అదరగొట్టారు.
కాగా మెగాస్టార్ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య కూతరు సురేఖను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో చిరంజీవి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ధవళ సత్యం. అప్పటికే చిరంజీవి సినిమాలతో బిజీగా ఉన్నాడు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని ఎదుగుతున్నాడు. కాగా ధవళ సత్యం చిరంజీవితో జాతర సినిమా చేశారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిస్టిబ్యూటర్ గా పనిచేసినట్లు చెప్పారు. అయితే ఆటైంలో అల్లు రామలింగయ్య సత్యంతో చిరంజీవి గురించి ఆరా తీశారట..
dhavala satyam about chiranjeevi marriage
తన కూతురు సురేఖను ఇవ్వడానికి నిశ్చయించుకున్నారని అందుకే అలా అడిగారని చెప్పారు.అయితే మెగస్టార్ గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పానని దీంతో పెళ్లి కుదిరిందని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చిరంజీవి తండ్రి ట్విస్ట్ ఇచ్చారని ఆయన ఈ పెళ్లికి ఒప్పుకోలేదని అన్నారు. ఆ తర్వాత చిరంజీవి తండ్రికి అన్ని విషయాలు చెప్పి ఒప్పించారని చెప్పారు. అలా చిరంజీవి సురేఖల పెళ్లి జరిగిందని గుర్తుచేసుకున్నారు. కాగా చిరంజీవి సురేఖ దంపతులు అందరికీ అదర్శంగా ఉంటూ పలు సామాజిక సేవలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిరంజీవి నెక్స్ట్ రిమేక్ మూవీ లూసీఫర్ తో రానున్నారు.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.