
Alia Bhatt: ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కేస్తున్నారు. ఇన్నాళ్ల వెయిట్ చేసి వెయిట్ చేసి మంచి వరుడు దొరకగానే ఏడడుగులు వేస్తున్నారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల్ని కూడా కనేస్తున్నారు. మరి కొద్ది రోజులలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ పండంటి బేబికి జన్మనివ్వనుంది. స్టార్ కిడ్ అయిన ఆలియా భట్.. రణ్‌భీర్‌ని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులు వైవాహిక జీవితం సంతోషంగానే గడిపింది. ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఏప్రిల్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్బీర్ కపూర్- ఆలియా జంట జూన్ లో తమ ప్రేగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లు చెప్పుకొచ్చారు . ప్రస్తుతం అలియా భట్ గర్భంతో ఉంటూ అవసరమైన మెడికల్ కేర్ తీసుకుంటోంది.
నవంబర్ ఎండింగ్ లో కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ అలియా భట్ డెలివరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రణబీర్ ఫ్యామిలీ అలియా భట్ ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడట. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అలియా భట్ డెలివరీకి హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఓ కారణం ఉంది. రణబీర్ తండ్రి రిషి కపూర్ అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స తీసుకుంది ఈ ఆసుపత్రిలోనే. అలాగే తుదిశ్వాస విడిచింది కూడా ఈ ఆసుపత్రిలోనే.
Did Alia Bhatt spend so much to have children
తనకు పుట్టబోయే బిడ్డ ఈ ఆసుపత్రిలో పురుడు పోసుకుంటే తన తండ్రి మళ్లీ పుట్టినట్టుగా ఉంటుందని రణ్‌బీర్ భావిస్తున్నాడట. అలియా భట్ ప్రసవం కోసం రణ్‌బీర్ కపూర్ రోజుకి రూ 15000 ఫీజు చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫీజు 15,000 అవుతుందట.. ఇక డెలివరీ చార్జెస్ రిమైనింగ్ ఎక్స్ట్రా పీసెస్ భారీగానే ఉంటాయట, కానీ ఇది స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ మ్యాటర్ కావడంతో అలియా తన బేబీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కోట్లు పోయడానికి సిద్ధపడిందట. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించి అలరించిన సంగతి తెలిసిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.