Home » Entertainment » Dil Raju Became Father
Entertainment

Dil Raju : దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా… ఇందులో ఎంత నిజం ఉంది..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 22, 2022, 9:30 pm
Advertisement

Dil Raju : టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న నిర్మించిన సినిమాల‌కి మినిమం గ్యారెంటీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్‌ని సాధించారు రాజు. ఆయన మొదటగా దిల్ అనే చిత్రంతో తన ప్రోడ్యూసర్ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు. అది అలా ఉంటే దిల్ రాజు ఇంట త్వరలో సంబరాలు జ‌రుగనున్నాయని తెలుస్తోంది. , దిల్ సినిమా నుంచి నిర్మాతగా తన ప్రొడక్షన్ కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

Advertisement

ఇక దిల్ రాజు పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన మొదటి భార్య అనిత మృతి చెందగా ఆ తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే త్వరలోనే దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది.2017 లో దిల్ రాజు భార్య అనిత హఠాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దిల్ రాజు తీవ్రస్థాయిలో మనోవేదనకు గురయ్యాడు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కూడా ఆయన కొంత సమయం పట్టింది. ఇక దిల్ రాజు ఏకైక కూతురు హన్షిత ఎక్కువగా ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వారి సన్నిహితుల అమ్మాయి తేజస్విని రెడ్డిని దిల్ రాజు లాక్ డౌన్ లో ఎలాంటి హడావుడి లేకుండా అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

dil raju became father

Advertisement

Dil Raju : దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్ప‌నున్నాడా..!

దిల్ రాజు రెండో భార్య వైఘా రెడ్డి (తేజస్విని) ప్రస్తుతం గర్భవతి అని, త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక విషయం తెలుసుకున్న నెటిజన్లు బడా నిర్మాత దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.తేజస్విని ప్రస్తుతం నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక దిల్‌ రాజ్ కూతురు హన్షితా రెడ్డికి ఇప్పటికే పెళ్లయ్యింది. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మేనస్.. దిల్ రాజు మనవడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి