Guntur Kaaram Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది. హీరోలంతా తమ సినిమాలని పండుగ సమయాలలో విడుదల చేయాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే ఈసారి వచ్చే సంక్రాంతికి కూడా సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల విడుదల పైన తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండి అని దిల్ రాజ్ కోరారు.
ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న రవితేజకి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో మాట్లాడామని, ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గితే తగ్గినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ పీపుల్స్ మీడియా వారికి కృతజ్ఞతలు. ఇది మంచి పరిణామం అని దిల్ రాజు అన్నారు. ఇక సంక్రాంతి రేసులో గుంటూరు కారం సైంధవ్, హనుమాన్ నా స్వామి రంగ విడుదల కానున్నాయి. రవితేజ ఈగల్ మూవీ పోటి నుంచి తప్పుకోవడంతో నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.
ఇక ప్రశాంత్ వర్మ దశకత్వం వహించిన హనుమాన్ సినిమా విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని కూడా వాయిదా వేయించాలని దిల్ రాజు చూశారు. కానీ అందుకు ప్రశాంత్ వర్మ ఒప్పుకోలేదు. ఇది పాన్ ఇండియా సినిమా అని, సౌత్ లో నార్త్ లో విడుదలవుతుందని, రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశామని, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని అన్నారు. దీంతో చేసేది ఏమీ లేక దిల్ రాజు అందుకు ఒప్పుకున్నారు. సంక్రాంతి రేసులో విడుదలవుతున్న నాలుగు సినిమాలలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి. ఇక పండగ అంటే ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. ఎలాగైనా సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.