Guntur Kaaram Movie : మహేష్ బాబుతో హనుమాన్ సినిమా పోటీ ఉన్న గుంటూరు కారం బంపర్ హిట్ .. నిర్మాత దిల్ రాజ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guntur Kaaram Movie : మహేష్ బాబుతో హనుమాన్ సినిమా పోటీ ఉన్న గుంటూరు కారం బంపర్ హిట్ .. నిర్మాత దిల్ రాజ్

Guntur Kaaram Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది. హీరోలంతా తమ సినిమాలని పండుగ సమయాలలో విడుదల చేయాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే ఈసారి వచ్చే సంక్రాంతికి కూడా సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల విడుదల పైన తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,5:00 pm

Guntur Kaaram Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు స్టార్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది. హీరోలంతా తమ సినిమాలని పండుగ సమయాలలో విడుదల చేయాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే ఈసారి వచ్చే సంక్రాంతికి కూడా సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు సమావేశమై సినిమాల విడుదల పైన తలెత్తిన సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆర్టికల్స్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని అన్నారు. ఎవరైనా సరే నిజాలు తెలుసుకొని రాయండి అని దిల్ రాజ్ కోరారు.

ముఖ్యంగా సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న రవితేజకి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలతో మాట్లాడామని, ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గితే తగ్గినట్టు కాదు. గతేడాది మూడు సినిమాలకే రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు ఐదు సినిమాలు పోటీలో ఉన్నాయి. మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా రవితేజ పీపుల్స్ మీడియా వారికి కృతజ్ఞతలు. ఇది మంచి పరిణామం అని దిల్ రాజు అన్నారు. ఇక సంక్రాంతి రేసులో గుంటూరు కారం సైంధవ్, హనుమాన్ నా స్వామి రంగ విడుదల కానున్నాయి. రవితేజ ఈగల్ మూవీ పోటి నుంచి తప్పుకోవడంతో నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి.

ఇక ప్రశాంత్ వర్మ దశకత్వం వహించిన హనుమాన్ సినిమా విడుదల తేదీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాని కూడా వాయిదా వేయించాలని దిల్ రాజు చూశారు. కానీ అందుకు ప్రశాంత్ వర్మ ఒప్పుకోలేదు. ఇది పాన్ ఇండియా సినిమా అని, సౌత్ లో నార్త్ లో విడుదలవుతుందని, రిలీజ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేశామని, ఇప్పుడు వాయిదా వేయడం కుదరదని అన్నారు. దీంతో చేసేది ఏమీ లేక దిల్ రాజు అందుకు ఒప్పుకున్నారు. సంక్రాంతి రేసులో విడుదలవుతున్న నాలుగు సినిమాలలో ఏది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో చూడాలి. ఇక పండగ అంటే ప్రేక్షకులు కూడా ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. ఎలాగైనా సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది