Home » Entertainment » Dil Raju Got Profit In Vakeel Saab Movie
Entertainment

Vakeel saab : వకీల్ సాబ్ దిల్ రాజుకి ఎన్ని కోట్లు లాభాలు వచ్చాయో తెలుసా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: April 7, 2021, 9:59 pm
Advertisement

Vakeel saab : వకీల్ సాబ్ మరికొన్ని గంటల్లో థియేటర్స్‌లో రాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా అనగానే సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడతాయి. అయితే మూడేళ్ళ తర్వాత రీ ఎంట్రీ సినిమా అందులో రెండు భాషల్లో 100 కోట్లు వసూళ్ళు రాబట్టిన సినిమా కాబట్టి అన్నీ రకాలుగా వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు ఊహకందని విధంగా పెరిగాయి. ఇక 15 రోజుల నుంచి దిల్ రాజు బృందం నిర్వహిస్తున్న ప్రమోషన్స్ సినిమా రేంజ్ ని మరో లెవల్‌కి తీసుకు వెళ్ళింది.

Advertisement

dil raju got profit in vakeel saab Movie

కాగా ఇటీవల వకీల్ సాబ్ బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్ అయింది. ఈవెంట్ మొత్తంలో నటుడు, నిర్మాత, పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ స్పీచ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ టాప్ వన్ ప్లేస్ కి చేరుకుంది. అదే రోజు పవర్ స్టార్ ఇచ్చిన స్పీచ్ సెకండ్ ప్లేస్ లో నిలవడంతో పవర్ స్టార్ అభిమానులే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గ్రేట్ గా ఫీలవుతున్నారు. అయితే తాజాగా వకీల్ సాబ్ కి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Vakeel saab : పవన్ మ్యానియా చూపిస్తే ఇక ఎన్ని కోట్ల లాభాలు వచ్చి పడతాయో ..?

దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాకి పెట్టిన బడ్జెట్ దాదాపు 85 నుంచి 90 కోట్లు అని సమాచారం. అయితే శాటిలైట్ ..ఓటీటీ రైట్స్.. థియేట్రికల్ రైట్స్ అన్నీ కిలిపి ఇప్పటికే 150 నుంచి 160 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా మీద దిల్ రాజుకి 25 నుంచి 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు సమాచారం. ఇక సినిమా రిలీజై పవన్ మ్యానియా చూపిస్తే ఇక ఎన్ని కోట్ల లాభాలు వచ్చి పడతాయో ఇప్పుడే చెప్పడం కష్టమని విశ్లేషకులు అంటున్నారట. చూడాలి మరి పవర్ స్టార్ స్టామినాతో దిల్ రాజు ఎంత లాభపడతాడో.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి