Home » Entertainment » Dil Raju Is Gaining Profit This Credit Goes To Anil Ravipudi
Entertainment

F 3 : ఎఫ్ 3 తో అప్పుడే లాభాలు చూస్తున్న దిల్ రాజు ..క్రెడిట్ మాత్రమే అనిల్ రావిపూడికి ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: January 31, 2021, 8:00 am
Advertisement

F3 : ఎఫ్ 3 .. విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్. సక్సస్ ఫుల్ సినిమా ఎఫ్ 2 కీ సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించడం అంత సులభమైన పని కాదు. నిర్మాతలు కూడా బ్యానర్ కి గొప్ప పేరు ఉండాలని అప్పుడప్పుడు కొన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ని తీస్తుంటారు. లాభాలు ఆశిస్తారు గాని ఇండస్ట్రీ హిట్ మాత్రం ఆశించరు. అయితే ఇలా ప్రతీ సినిమా విషయంలో అంటే అయ్యే పని కాదు. ఒకప్పుడు మాతృదేవోభవ .. పెళ్ళి సందడి.. పెళి పందిరి లాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలే నిర్మాలకి సంచుల కొద్ది డబ్బులు తెచ్చిపెట్టాయి.

Advertisement

dil-raju-is-gaining-profit-this-credit-goes-to-anil-ravipudi

ఒక్కోసారి ఒక్కో జానర్ సినిమాలు ట్రండ్ క్రియేట్ చేస్తుంటాయి. ఎఫ్ 2 కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరు హాట్ హీరోయిన్స్ .. కథ కొత్తదేమి కాకపోయినా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడి కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేశాడు. ఒకప్పుడు సందడే సందడి.. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి..సరదా సరదాగా లాంటి సినిమాలు ఇలాంటి కథా నేపథ్యంలో తెరకెక్కి నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలే. అయితే ఈ జనరేషన్ కి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ని నడిపించి అనిల్ రావిపూడి సక్సస్ అయ్యాడు. ఇక ఈ తరహా కథలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా వచ్చాయి.

Advertisement

F3 : డిజిటల్ రైట్స్ – శాటిలైట్ రైట్స్ రూపంలో దాదాపు 25 కోట్ల వరకూ డీల్ క్లోజ్ ..?

Advertisement

కాగా ఎఫ్ 2 కాంబినేషన్ మళ్ళీ రిపిటవుతోంది. అదే నిర్మాత.. అదే దర్శకుడు .. ఆదే హీరో.. హీరోయిన్స్. ఎఫ్ 2 కి బదులు ఎఫ్ 3 అన్న టైటిల్. కథ లో కొంత మార్పు. అందుకే ఎఫ్ 3 కి భారీ స్థాయిలో బిజినెస్ అయి నిర్మాత దిల్ రాజు ఫుల్ ఖుషీగా ఉన్నాడని అంటున్నారు. ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 లో థ్రిబుల్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని ముందు నుంచే దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నాడు. ఆ కారణంగానే గానే తాజాగా డిజిటల్ రైట్స్ – శాటిలైట్ రైట్స్ రూపంలో దాదాపు 25 కోట్ల వరకూ డీల్ క్లోజ్ అయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ క్రెడిట్ అంతా దర్శకుడి అనిల్ రావిపూడి కే దక్కుందని అంటున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్ దశలో ఉండాగానే దిల్ రాజు కి లాబాలు వస్తున్నాయని అంటున్నారు. కాగా ఎఫ్ 3 ఆగస్ట్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి