Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ ఎవరైనా ఉన్నారంటే అది దిల్ రాజు మాత్రమే. సినిమా టైలర్ చూడగానే సినిమా ఎలా ఉంటుందో ఒక అంచనాకు దిల్ రాజు వస్తారని అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఖచ్చితమైన లెక్కలు వేసుకొని డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంటూ ఉంటారు. చాలా సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి అత్యధిక కలెక్షన్లను సాధించారు. అలాగే కొన్ని సినిమా హక్కులను తీసుకోకుండా సైడ్ అయిపోయి సేఫ్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో మరోసారి దిల్ రాజ్ అంచనాలు కరెక్ట్ అయ్యాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ‘ శాకుంతలం ‘ సినిమాతో దెబ్బతిన్న దిల్ రాజ్ ‘ బలగం ‘ సినిమాతో రికవరీ చేసుకోగలిగారు.
అయితే ఈ సంవత్సరం థాంక్యూ మూవీ తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా రైట్స్ ని భారీగా చెల్లించి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఏరియా వైజ్ గా వచ్చేసరికి దిల్ రాజు కూడా ముందుగా నైజాంలో ఆదిపురుష్ రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే పీపుల్స్ మీడియా వారు ఏకంగా 60 కోట్లు డిమాండ్ చేయడంతో అంత వర్క్ అవుట్ కాకపోవచ్చని భావించి దిల్ రాజు తప్పుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అంతే మొత్తానికి నైజాం రైట్స్ ని తీసుకుంది. అయితే సినిమాకి మొదటి రోజు భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. నైజాం ఏరియాలో మొదటి రోజు ఆదిపురుష్ సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసింది.
అయితే ఈ సినిమాకి యావరేజ్ టాకు వచ్చింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు రోజులకు చాలా వరకు టికెట్లు అమ్ముడైపోయాయి. దీంతో మూడు రోజుల వరకు ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చే అవకాశం ఉంది. అయితే సోమవారం నుంచి థియేటర్ లకు ఆడియన్స్ ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. అయితే దిల్ రాజ్ ఈ సినిమా హక్కులు తీసుకోకుండా వెనక్కి తగ్గడం వలన పెద్ద నష్టం నుంచి బయటపడ్డారని ఇండస్ట్రీ టాక్. గతంలో ఆచార్య, లైగర్ సినిమాల విషయంలో వెనక్కి తగ్గి సేఫ్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో సేఫ్ జోన్లో పడ్డారని తెలుస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.