Home » Entertainment » Dil Raju Tollywood Heroes No Need To Reduce There Remuneration
Entertainment

Dil Raju : హీరోల పారితోషికం విషయంలో దిల్‌ రాజు ఒక్కడే బకరా అయ్యాడా?

Authored By
aruna
The Telugu News | Updated on: August 1, 2022 6:15 pm
Advertisement

Dil Raju : టాలీవుడ్ లో నిర్మాతలు కష్టాలను ఎదుర్కొంటున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయం సినిమాలు యొక్క బడ్జెట్ను తగ్గించాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే అంతా కూడా హీరోలు పారితోషికాలను తగ్గించుకోవాలనే అంశాన్ని తెర పైకి తీసుకు వచ్చారు ఆ విషయాన్ని గురించి దిల్‌ రాజు ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరి కొందరు హీరోలతో చర్చించాడు. వారు కూడా పారితోషికాన్ని దాదాపుగా 25 శాతం తగ్గించుకునేందుకు ఓకే చెప్పారని సమాచారం అందింది.

Advertisement

హీరోలు పారితోషికం తగ్గించుకునేందుకు ఓకే చెప్పిన ఈ సమయంలో మరి కొందరు నిర్మాతలు హీరోలు పారితోషికం తగ్గించుకోవాలంటూ అడగడం అవివేకమని, వారి యొక్క మార్కెట్ను అనుసారంగా వారికి పారితోషికం ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఆ విషయంలో బేరసారాలు ఆడితే హీరోలను అవమానించినట్లే అవుతుంది అని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన తర్వాత ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూడా హీరోలను తగ్గించుకోవాలని అడగడం సరి కాదని వారి నుండి ఎంత వరకు సాధ్యం అయితే అంత వరకు సినిమాకి హైప్ క్రియేట్ చేసుకుని బిజినెస్ చేసుకోవాలి తప్పితే.. సినిమాలో ఆ వారు నటించినందుకు గానూ పారితోషికాన్ని తగ్గించుకోవాలి అని అడగడం సరి కాదని పేర్కొన్నాడు.

Dil Raju tollywood heroes no need to reduce there remuneration

Advertisement

ఇంకా మరి కొందరు నిర్మాతలు కూడా టాలీవుడ్ హీరోలు పారితోషికం తగ్గించుకోవాల్సి అవసరం లేదని బాహాటంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రమే హీరోల పారితోషికం తగ్గించుకోవాల్సిందే అంటూ చర్చలు జరిపి బకరా అయ్యాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు ఎలా స్పందిస్తాడు, ఆయన చర్చలు జరిపిన హీరోలు తమ మాటపై నిలుస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి