Sreemukhi : జాతి రత్నాలు షోలు ఈ మధ్య బాగానే క్లిక్ అవుతోంది. కొత్త వాళ్లను పట్టుకొచ్చి.. స్టాండప్ కామెడీ చేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ షో ఫార్మూలానే మళ్లీ వాడేస్తున్నారు. అయితే ఈ జాతి రత్నాలు మాత్రం ఇప్పుడు బాగానే మెప్పిస్తోంది. అందులోని కామెడీ, పంచ్‌లు బాగానే ఉంటున్నాయి. ఇక శ్రీముఖి, ఇమాన్యుయేల్, నూకరాజు, పంచ్ ప్రసాద్ వంటి వారు బాగానే నెట్టుకొస్తున్నారు. ఈ మధ్య ఇమాన్యుయేల్ ఎక్కువగా హైలెట్ అవ్వడం లేదు గానీ.. నూకరాజు, ప్రసాద్ మాత్రం దుమ్ములేపేస్తున్నారు. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో నూకరాజు రెచ్చిపోయాడు. శ్రీముఖి సైతం మధ్యలో పంచులతో ఆడేసుకుంది. తాజాగా వీరంతా కలిసి రంగస్థలం స్పూప్ వేశారు.
జగపతి బాబు పాత్రలో పంచ్ ప్రసాద్.. చిట్టిబాబుగా నూకరాజు.. మహేష్ కారెక్టర్‌ను ఇమాన్యుయేల్.. సమంతగా శ్రీముఖి నటించింది. చెవిటి పాత్రలో నూకరాజు నటించాడు. తనకు వినిపించడం లేదన్నట్టుగా ఇమాన్యుయేల్ కౌంటర్లు వేస్తాడు. నువ్ ఈ షోకు పెద్ద బొక్క అని చేతులు మాత్రం సూపర్ అన్నట్టుగా సైగా చేస్తుంటాడు. ఇక శ్రీముఖి వచ్చి తన పొలం సర్పంచ్ లాక్కున్నాడు అని వింత వింత ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి చెప్పుకుంటుంది. కానీ నూకరాజుకు వినిపించనట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇక తన లౌడ్ స్పీకర్‌తో మొత్తుకుంటుంది. సర్పంచ్ సంగతి చూసి.. నీ పొలం నీకు ఇప్పిస్తా అని నూకరాజు అంటాడు.
మరి నాకు ఏమైనా ఉందా? అని నూకరాజు డబుల్ మీనింగ్ డైలాగ్‌లో శ్రీముఖిని అడిగేస్తాడు. నీకు ఏమైనా ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది? నీకే తెలియాలి అంటూ దారుణమైన పంచ్ వేస్తుంది. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తుంటారు. శ్రీముఖి దెబ్బకు ఇమాన్యుయేల్ నోర్మూసుకుంటాడు. అలా నూకరాజుకు ఆ స్కిట్‌లో పలు సందర్భాల్లో సెటైర్లు పడుతుంటాయి. ఏది ఏమైనా కూడా జాతి రత్నాలు షోను పంచ్ ప్రసాద్, శ్రీముఖి, ఇమాన్యుయేల్, నూకరాజులు ముందుండి చక్కగా నడిపిస్తున్నారు. టాప్ రేటింగ్స్ రాకపోయినా జనాలను మాత్రం ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.