Mr Bachchan : ఏంటి.. ర‌వితేజ‌ హీరోయిన్ చీర‌లో అలా చేయి పెట్టాడు.. హ‌రీష్ శంకర్ వివ‌ర‌ణ‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mr Bachchan : ఏంటి.. ర‌వితేజ‌ హీరోయిన్ చీర‌లో అలా చేయి పెట్టాడు.. హ‌రీష్ శంకర్ వివ‌ర‌ణ‌..!

Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Mr Bachchan : ఏంటి.. ర‌వితేజ‌ హీరోయిన్ చీర‌లో అలా చేయి పెట్టాడు.. హ‌రీష్ శంకర్ వివ‌ర‌ణ‌..!

Mr Bachchan : మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, సత్య, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపించింది. ఫలితంగా రవితేజ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు స్పందన ఆశించినట్లుగా దక్కలేదు.

Mr Bachchan ఇది అస‌లు విష‌యం..

మిస్టర్ బచ్చన్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన కూడా.. సక్సెస్ ప్రెస్‍మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. మీడియాతో మాట్లాడారు దర్శకుడు హరీశ్ శంకర్. ఈ క్రమంలో మిక్స్డ్ టాక్ రావడంపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన స్పందించారు. మిక్స్డ్ రివ్యూలు కొత్తేం కాదని, ఇప్పటికే చాలా సినిమాలకు వచ్చాయని హరీశ్ శంకర్ తెలిపారు. షోలు సాగుతున్న కొద్ది మిస్టర్ బచ్చన్ మూవీకి టాక్ మారుతోందని ఆయన అన్నారు. “మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చాయి. కొత్తగా ఏముంది. నాకు నచ్చినవి కూడా ట్వీట్ చేశా. ఇది కూడా సమానంగానే ఉంది. ఇదేం కొత్తకాదు. షోల తర్వాత టాక్ పెరుగుతోంది. తర్వాత సెలవులు ఉన్నాయి. సినిమా మా అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. మా అంచనాలు దాటాలని కోరుకుంటున్నాం” అని హరీశ్ శంకర్ అన్నారు.

Mr Bachchan ఏంటి ర‌వితేజ‌ హీరోయిన్ చీర‌లో అలా చేయి పెట్టాడు హ‌రీష్ శంకర్ వివ‌ర‌ణ‌

Mr Bachchan : ఏంటి.. ర‌వితేజ‌ హీరోయిన్ చీర‌లో అలా చేయి పెట్టాడు.. హ‌రీష్ శంకర్ వివ‌ర‌ణ‌..!

మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డ్రెస్‍ను రవితేజ ముందు నుంచి పట్టుకునే స్టెప్ ఉంది. అయితే, అభ్యంతకరంగా ఉందంటూ కామెంట్స్ రాగా, దీనిపై హరీశ్ శంకర్ స్పందించారు. ఈ పాటను మూవీ తొలి రోజే షూట్ చేశామని హరీశ్ శంకర్ తెలిపారు. శేఖర్ మాస్టర్ లాంటి పెద్ద కొరియోగ్రాఫర్‌కు షూట్ ఫస్డ్ డేనే తాను చెప్పలేకపోయానని అన్నారు. “అది ఫస్ట్ డే షూట్. డ్యాన్స్ మూవ్‍మెంట్లు.. మూవ్‍లో వెళ్లిపోతే చూసేందుకు ఎబ్బెట్టుగా అనిపించవు. ఎప్పుడైతే మూవ్‍మెంట్‍ను పాస్ చేసి ఫొటోలాగా తీస్తే.. ఏ పాటలో చూసినా ఇబ్బంది కలిగేలా చేయవచ్చు. శేఖర్ మాస్టర్ చాలా పెద్ద మాస్టర్. ఫస్ట్ డే షూట్. ఇది పెద్దగా అవసరం లేదని నాకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఫస్ట్ డే షూట్ మాస్టర్ రాగానే వద్దంటే ఆయన నిరాశపడతారని అనుకున్నా” అని హరీశ్ శంకర్ తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది