Puri Jagannadh comments on tollywood star heros
Puri Jagannadh : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరైన పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయిన చేయాలని హీరోలు అనుకుంటూ ఉంటారు. అప్పటి వరకు మాస్ సినిమాలతో అంతగా ఆకట్టులేక పోయిన హీరోలంతా పూరి సినిమాలతో ఇండస్ట్రీ కొట్టిన వారిలో చాలా మందే ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా కేవలం నాలుగైదు నెలల్లో సినిమా పూర్తి చేసే సత్తా పూరీది. కేవలం వారం రోజుల్లో సినిమా కథ రాసే టాలెంట్ పూరి సొంతం. ఇదిలా ఉండగా ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైన పూరి టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు రీవిల్ చేశాడు.
ఏ హీరోకు ఏం చెపితే వెంటనే కాల్షీట్లు ఇస్తారో తెలుసా అంటూ హీరోల గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.సినిమాలో.. విలన్ పెద్ద గన్ డీలర్ అంటూ ఇష్టం వచ్చినట్టు కాల్చుకోవచ్చని చెపితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంటనే కాల్షీట్లు ఇచ్చేస్తారని పూరి అన్నారు. చిత్ర షూటింగ్ అంతా ఇండోర్ సెట్లోనే చేస్తున్నామంటే అందుకు ప్రభాస్ ఓకే చెప్పేస్తాడని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొడదాం.. కుమ్మేద్దాం భయ్యా అంటే ఎన్టీఆర్ సినిమాకు వెంటనే ఒప్పుకుంటారని తెలిపారు.నెల రోజుల్లో సినిమా కంప్లీట్ చేద్దాం అంటే మాస్ రాజా రవితేజ వెంటనే అందుకు సంబరపడి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అన్నారు.
Puri Jagannadh comments on tollywood star heros
ఇక సినిమా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని చెబితే మహేష్ బాబు సరే అంటారని అన్నారు. అయితే ఇదంతా ఇండస్ట్రీలో ఉన్న టాక్ మాత్రమే అని పూరి చివరలో చెప్పడం గమనార్హం.ఇటీవల చాక్ లెట్ బాయ్ రామ్ పోతినేనితో ఇస్మార్ట్‌శంకర్ తీసి హిట్టు కొట్టిన పూరి మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఆయన బిజీగా గడుపుతున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.