Oil prices : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు.. సామాన్యుడికి ఊరట..!

దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు మండిపోతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుడికి ఊరట కలిగించే దిశగా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వంట నూనెల ధరలను తగ్గించేందుకుగానూ అన్ని శుద్ధి చేసిన నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా మార్కెట్లలో గత వారం సోయాబీన్ నూనె ధరలు క్షీణించాయి. ఈ మేరకు ఇది ఇతర నూనెల ధరలపై కూడా ప్రభావం చూపనుందని వ్యాపారులు అంటున్నారు.

వేరుశెనగతో పాటు శెనగ నూనె ధరలు గతంతో పోలిస్తే తగ్గినట్లు చెబుతున్నారు. శీతాకాలంలో సాధారణంగా క్రూడ్ పామాయిల్‌కు డిమాండ్ తక్కువగా ఉంటుందని.. అందుచేత పామాయిల్ ధర కూడా తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నారు. దిగుమతి సుంకం తగ్గించడమే ఈ ధరల తగ్గింపుకు కారణమంటున్నారు. మరోవైపు కేంద్రం.. వంట నూనెల ధరలు తగ్గించేందుకు 2022 మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది.

edible oil prices decline last week after reduction in import duty

ఇది కాక.. ముడి పామాయిల్‌తో సహా అనేక వ్యవసాయ వస్తువుల ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లలో వాణిజ్యాన్ని ఏడాది పాటు నిలిపివేసింది. వంట నూనెల ధరలపై.. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శలు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago