Director : ‘కింద కోసేసిన ‘ డైరెక్టర్ కి 250 కోట్లు ?? గుండు కొట్టించుకోవడం గ్యారెంటీ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Director : ‘కింద కోసేసిన ‘ డైరెక్టర్ కి 250 కోట్లు ?? గుండు కొట్టించుకోవడం గ్యారెంటీ !

 Authored By sandeep | The Telugu News | Updated on :12 December 2022,11:30 am

Director : కోటలో రాణి.. తోటలో రాముడు తరహా కథలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో వందల్లో వచ్చుంటాయి. అలాంటి క‌థ‌ని మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ కోసం రాసుకున్నాడు కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన. కాకపోతే తోటలో రాముడికి చిన్న ట్విస్ట్ ఇవ్వ‌గా, ఆ ఒక్క డేంజర్ ట్విస్టుతోనే ఉప్పెన సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు పెరిగాయి. . ప్రేమించిన వాడి పక్కలో పడుకోవడం కాదు.. వాడు పక్కనుంటే చాలు అనుకోవడమే ప్రేమ అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. చిత్రంలో హీరో ప్రైవేట్ పార్ట్ కూడా కోయించేలా క‌థ‌ని సెట్ చేసి మంచి విజ‌యాన్ని అయితే అందుకున్నాడు. బుచ్చిబాబుకి, వ‌రుణ్ తేజ్ కి తొలి సినిమా మంచి విజ‌యాన్ని అందించింది.

ఇక బుచ్చిబాబు చాలా రోజుల త‌ర్వాత రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. చెర్రీ ప్ర‌స్తుతం తన 15 సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నఈ సినిమాచిత్రీక‌ర‌ణ చాలా స్పీడ్‌గా జ‌రుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవక ముందే రామ్ చరణ్ తేజ్ మరొక సినిమాను మొదలు పెట్టాలని భావించ‌గా, ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాను వెంకట సతీష్ నిర్మించనున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కోసం అనుకున్న స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ మూవీ కథను కొంత మార్పులు చేసి రామ్ చరణ్ తో తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌.

director risks to the producer

director risks to the producer

Director : తేడా కొడితే అంతే..!

అయితే బడ్జెట్ విషయంలో మాత్రం నిర్మాత దర్శకుడు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ఖర్చు చేయనున్నట్లుగా స‌మాచారం. దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో విలేజ్ బాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకురానుండ‌గా, ఇది కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా అని కూడా అంటున్నారు. ఉప్పెన సినిమాతో 100 కోట్ల మార్కెట్ను అందుకున్న బుచ్చిబాబు ఆ రేంజ్ లో రామ్ చరణ్ ను చూపిస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే యువ ద‌ర్శ‌కుడితో నిర్మాత‌లు ఇంత రిస్క్ చేస్తుండ‌గా, తేడా కొట్టిందంటే గుండు కొట్టించాల్సిందే అని కొంద‌రు నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది