Director : కోటలో రాణి.. తోటలో రాముడు తరహా కథలు ఇప్పటి వరకు ఎన్నో వందల్లో వచ్చుంటాయి. అలాంటి కథని మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ కోసం రాసుకున్నాడు కొత్త దర్శకుడు బుచ్చిబాబు సన. కాకపోతే తోటలో రాముడికి చిన్న ట్విస్ట్ ఇవ్వగా, ఆ ఒక్క డేంజర్ ట్విస్టుతోనే ఉప్పెన సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు పెరిగాయి. . ప్రేమించిన వాడి పక్కలో పడుకోవడం కాదు.. వాడు పక్కనుంటే చాలు అనుకోవడమే ప్రేమ అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. చిత్రంలో హీరో ప్రైవేట్ పార్ట్ కూడా కోయించేలా కథని సెట్ చేసి మంచి విజయాన్ని అయితే అందుకున్నాడు. బుచ్చిబాబుకి, వరుణ్ తేజ్ కి తొలి సినిమా మంచి విజయాన్ని అందించింది.
ఇక బుచ్చిబాబు చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. చెర్రీ ప్రస్తుతం తన 15 సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నఈ సినిమాచిత్రీకరణ చాలా స్పీడ్‌గా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవక ముందే రామ్ చరణ్ తేజ్ మరొక సినిమాను మొదలు పెట్టాలని భావించగా, ఈ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను వెంకట సతీష్ నిర్మించనున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కోసం అనుకున్న స్పోర్ట్స్ ప్యాక్ డ్రాప్ మూవీ కథను కొంత మార్పులు చేసి రామ్ చరణ్ తో తెరకెక్కించనున్నాడట.
అయితే బడ్జెట్ విషయంలో మాత్రం నిర్మాత దర్శకుడు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిర్మాతలు దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మధ్యలో ఖర్చు చేయనున్నట్లుగా సమాచారం. దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో విలేజ్ బాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరపైకి తీసుకురానుండగా, ఇది కబడ్డీ స్పోర్ట్స్ డ్రామా అని కూడా అంటున్నారు. ఉప్పెన సినిమాతో 100 కోట్ల మార్కెట్ను అందుకున్న బుచ్చిబాబు ఆ రేంజ్ లో రామ్ చరణ్ ను చూపిస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే యువ దర్శకుడితో నిర్మాతలు ఇంత రిస్క్ చేస్తుండగా, తేడా కొట్టిందంటే గుండు కొట్టించాల్సిందే అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.