director teja who smashed heroine sada cheek
Sada : హీరోయిన్ సదా గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ అమ్మడు నటించిన తొలిచిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో సదా వస్తుందంటే చాలు ఒకే డైలాగ్ అందరికి గుర్తొచ్చేది. ‘వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్‌తో సదా చాలా ఫేమస్ అయిపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన సదా.. ‘జయం’చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా సదాకు మంచి పేరు తీసుకు రావడంతో తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళనాట బడా దర్శకుడు శంకర్ ద్విభాషా చిత్రం ‘అపరిచితుడు’లో హీరో విక్రమ్‌కు సరనస నటించి టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది.సదా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాక సినిమాల సెలక్షన్ విషయంలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
కొత్త హీరోయిన్ల రాకతో వారి గ్లామర్ షో ముందు సదా తేలిపోయింది. ఆమె నటించిన టక్కరి, నాగ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కొన్నాళ్లు తమిళ ఇండస్ట్రీలో కొనసాగినా అక్కడ కూడా అవకాశాలు రాకపోవడంతో సదా సినిమాలకు ఒక్కసారిగా దూరమైంది. ప్రస్తుతం సదా సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ రన్ చేస్తోంది. మొన్నటివరకు ఓ డ్యాన్స్ ప్రొగ్రామ్‌కు జడ్జిగా కూడా వ్యవహరించింది. సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సదా.. తొలి చిత్రం జయం తన కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో అతిశయోక్తి లేదు.అయితే, చిత్రం సినిమా విజయంతో మంచి జోరుమీదున్న దర్శకుడు నితిన్ హీరోగా సదా హీరోయిన్‌గా ‘జయం’ చిత్రాన్ని తెరకెక్కించాడు.
director teja who smashed heroine sada cheek
ఈ సినిమా నటీనటులకు ఇద్దరికీ డెబ్యూ మూవీనే.. ఇందులో గోపిచంద్ విలన్ రోల్ చేశాడు. ఆర్ పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. అయితే, షూటింగ్ సమయంలో హీరోయిన్ సదా చెంప చెల్లుమనిపించాడట దర్శకుడు తేజ.. ఓ సీన్‌లో భాగంగా సదా ఏడ్వాలి. కానీ ఆమెకు ఏడుపు రాలేదంట.. చాలా టేక్స్ తీసుకోవడంతో తేజకు కోపం వచ్చి చెంప మీద ఒక్కటిచ్చాడట.. దీంతో సదా ఏడవడంతో దానినే సీన్ కింద తీయడంతో ఓకే అయ్యిందట.. ఈ విషయాన్ని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక జయం సినిమా విషయానికొస్తే రూ.3.7 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ మాత్రమే చేయగా.. రూ.15.16 కోట్ల షేర్‌ను రాబట్టి తేజ కెరీర్ లోనే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్
గా నిలిచింది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.