Sada : నటి సదా చెంప పగులగొట్టిన డైరెక్టర్.. ఎందుకు తెలుసా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sada : నటి సదా చెంప పగులగొట్టిన డైరెక్టర్.. ఎందుకు తెలుసా!

 Authored By mallesh | The Telugu News | Updated on :16 January 2022,4:00 pm

Sada : హీరోయిన్ సదా గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ అమ్మడు నటించిన తొలిచిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో సదా వస్తుందంటే చాలు ఒకే డైలాగ్ అందరికి గుర్తొచ్చేది. ‘వెళ్లవయ్యా వెళ్లు వెళ్లూ’ అనే ఒక్క డైలాగ్‌తో సదా చాలా ఫేమస్ అయిపోయింది. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన స‌దా.. ‘జ‌యం’చిత్రంతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా సదాకు మంచి పేరు తీసుకు రావడంతో తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత తమిళనాట బడా దర్శకుడు శంక‌ర్ ద్విభాషా చిత్రం ‘అపరిచితుడు’లో హీరో విక్ర‌మ్‌కు సరనస న‌టించి టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది.సదా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యాక సినిమాల సెలక్షన్ విషయంలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

కొత్త హీరోయిన్ల రాకతో వారి గ్లామర్ షో ముందు సదా తేలిపోయింది. ఆమె నటించిన టక్కరి, నాగ సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. కొన్నాళ్లు తమిళ ఇండస్ట్రీలో కొనసాగినా అక్కడ కూడా అవకాశాలు రాకపోవడంతో సదా సినిమాలకు ఒక్కసారిగా దూరమైంది. ప్రస్తుతం సదా సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ రన్ చేస్తోంది. మొన్నటివరకు ఓ డ్యాన్స్ ప్రొగ్రామ్‌కు జడ్జిగా కూడా వ్యవహరించింది. సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సదా.. తొలి చిత్రం జయం తన కెరీర్‌ను మలుపు తిప్పిందనడంలో అతిశయోక్తి లేదు.అయితే, చిత్రం సినిమా విజయంతో మంచి జోరుమీదున్న దర్శకుడు నితిన్ హీరోగా సదా హీరోయిన్‌గా ‘జయం’ చిత్రాన్ని తెరకెక్కించాడు.

director teja who smashed heroine sada cheek

director teja who smashed heroine sada cheek

Sada : అనుకోకుండా సినిమాలకు దూరం

 ఈ సినిమా నటీనటులకు ఇద్దరికీ డెబ్యూ మూవీనే.. ఇందులో గోపిచంద్ విలన్ రోల్ చేశాడు. ఆర్ పీ పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. అయితే, షూటింగ్ సమయంలో హీరోయిన్ సదా చెంప చెల్లుమనిపించాడట దర్శకుడు తేజ.. ఓ సీన్‌లో భాగంగా సదా ఏడ్వాలి. కానీ ఆమెకు ఏడుపు రాలేదంట.. చాలా టేక్స్ తీసుకోవడంతో తేజకు కోపం వచ్చి చెంప మీద ఒక్కటిచ్చాడట.. దీంతో సదా ఏడవడంతో దానినే సీన్ కింద తీయడంతో ఓకే అయ్యిందట.. ఈ విషయాన్ని సదా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక జయం సినిమా విషయానికొస్తే రూ.3.7 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ మాత్ర‌మే చేయగా.. రూ.15.16 కోట్ల షేర్‌ను రాబట్టి తేజ కెరీర్ లోనే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌
గా నిలిచింది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది