Categories: EntertainmentNews

VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..!

VN Aditya : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు “మిస్టర్ బచ్చన్,” “విశ్వం,” “మా కాళి,”, “స్వాగ్”తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు.”నా మూడు సెన్సిబుల్, విలువైన సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాను, మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అర క్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది.” అని ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీమ్ ఆదిత్య సినిమాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు సరైన కారణాలు తెలియ రాలేదు. కానీ సదరు దర్శకుడిని మాత్రం బాగా బాధపడుతున్నట్లు అర్థమవుతుంది. ఆయన డైరెక్ట్ చేసిన లవ్ @ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు వంటి మూడు సినిమాకు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేయడం తో ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాలను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేస్తుందని ఆశిస్తూ దర్శకుడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.వి.ఎన్ ఆదిత్య తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా కూడా పనిచేశారు.

VN Aditya : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని థియేటర్లలో 200 రోజుల పాటు దిగ్విజయంగా ఆడిన “మనసంతా నువ్వే” సినిమా డైరెక్ట్ చేసి ఆదిత్య మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నేనున్నాను అంటే ఎమోషనల్ సినిమాతో మరోసారి మంచి హిట్ సాధించారు. “బాస్” మూవీ తో కూడా విజయం సాధించారు. అనంతరం ఇప్పటిదాకా ఆయన ఒక్క మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ కాలేదు. 2011 తర్వాత ఆయన తెలుగు సినిమాలే చేయలేదు. 2018లో ఒక ఇంగ్లీష్ సినిమా తీశారు దానివల్ల వచ్చిన గుర్తింపు ఏమీ లేదు. తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మూడు సినిమాలు తీశాడు అవి మాత్రం రిలీజ్ రావడం లేదు. కార్తికేయ 2, వెంకీ మామ, నిశ్శబ్దం, ఓ బేబీ, ధమాకా వంటి సినిమాలతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరించింది. మరి ఇలాంటి వీరిపై ఆరోపణ రావడం దానికి ఒక చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

7 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

9 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

13 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

16 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

19 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago