Home » Entertainment » Director Who Ruined The Heros Life By Blocking The Heros Girlfriend
Entertainment

Director : హీరో గర్ల్ ఫ్రెండ్ ని అడ్డం పెట్టుకుని హీరో బతుకు నాశనం చేసిన డైరెక్టర్ !

Authored By
Breaking News
The Telugu News | Published on: May 9, 2023, 8:00 pm
Advertisement

Director : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అందరికీ సుపరిచితుడే. హీరోగా మాత్రమే కాకుండా అనేకమైన వైవిధ్యమైన పాత్రలు చేస్తూ పరిపూర్ణమైన నటుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఇతర హీరోల చిత్రాల్లో కూడా కీలకపాత్రలు మరియు నెగటివ్ పాత్రలు పోషించి… సత్తా చాటిన నటుడు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఎదురైనా అనుభవాలు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

Advertisement

director who ruined the hero’s life by blocking the hero’s girlfriend

సినిమాలో రాణించడానికి ఆడిషన్ కోసం వెళ్లి.. ఆఫీస్ చుట్టూ తెప్పించుకొని గంటలపాటు వేచి ఉండటం.. వంటి కష్టాలు పడిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. “బేఖుడి” అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవ్వాలి కానీ ఆ డైరెక్టర్ నన్ను అడిగిన ప్రశ్నతో సినిమా వదులుకున్న. నీకు సినిమాల అవకాశం కావాలా..? నీ ప్రేయసి కావాలా..? అని నిర్ణయించుకోమన్నారు. వెంటనే ఆ సినిమా వద్దనుకున్నాను. ఆ తర్వాత నా మీద చాలా రూమర్లు పుట్టించారు.

Advertisement

నా గురించి తప్పుడు ప్రచారం కూడా చేయించారు. నాకు సినిమాలు చేయటం రాదని.. నటన రాదని ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొందరు ఆయన మాటలు నమ్మి నాకు కొన్ని అవకాశాలు తొలగించడం జరిగింది. ఇండస్ట్రీలో నిజం కన్నా అబద్ధానికి ఎక్కువ విలువ ఇస్తారు అని తొలిసారి అప్పుడే అర్థమైంది. కానీ చివరకు సత్యమే గెలుస్తుందని నమ్మేవాడిని నేను.. అంటూ ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో పడిన కష్టాలు గురించి సైఫ్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి