Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు మళ్లీ అడ్డంకులు..!
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. కానీ రిలీజ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల బాకీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు మళ్లీ అడ్డంకులు..!
శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ‘హరిహర వీరమల్లు’ను నిర్మించిన ఏఎం రత్నం గతంలో నిర్మించిన కొన్ని చిత్రాలకు సంబంధించిన పంపిణీ బాకీలను ఇంకా తీర్చలేదని నైజాం డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.ఆక్సిజన్ (2017) సినిమా పంపిణీ హక్కులు ఆసియన్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసిన సమయంలో కలెక్షన్లు తక్కువైతే రీఫండబుల్ ఒప్పందం చేశారు.
ఇప్పటివరకు వడ్డీతో కలిపి రూ.2,60,42,548 తిరిగి ఇవ్వాల్సిన బాకీ ఉందని వారు పేర్కొన్నారు.మరోవైపు ముద్దుల కొడుకు, బంగారం సినిమాలకు సంబంధించి రూ.90 లక్షలు రీఫండబుల్ అడ్వాన్స్‌గా మహాలక్ష్మి ఫిలిమ్స్ ఇవ్వగా అది ఇప్పటివరకు చెల్లించలేదని మరో ఫిర్యాదు చేశారు.మొత్తం బాకీ: ₹ 3,50,42,548. ఈ మొత్తం రికవరీ కాకపోతే నైజాం ఏరియాలో ‘హరిహర వీరమల్లు’ విడుదలను అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. కాగా ఈ సినిమా 2020 లో ప్రారంభమైనా అనేక కారణాలతో వాయిదాల పాలైంది
Allu Family |సినీ నటుడు అల్లు అర్జున్ కుటుంబానికి చెందిన ప్రముఖ నిర్మాణం ‘అల్లు బిజినెస్ పార్క్’ ఇప్పుడు వివాదాస్పదంగా…
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
This website uses cookies.