Divi Vadthya : ర‌వితేజ వ‌ల‌న బాత్‌రూమ్‌లో నోరు మూసుకొని వెక్కి వెక్కి ఏడ్చా.. బిగ్ బాస్ బ్యూటీ దివి సంచ‌ల‌న కామెంట్స్

Authored By Ramu | The Telugu News | Published on: March 14, 2024, 8:00 pm
  •  Divi Vadthya : ర‌వితేజ వ‌ల‌న బాత్‌రూమ్‌లో నోరు మూసుకొని వెక్కి వెక్కి ఏడ్చా.. బిగ్ బాస్ బ్యూటీ దివి సంచ‌ల‌న కామెంట్స్

Divi Vadthya  : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ షోతో వెలుగులోకి వ‌చ్చిన అందాల భామ దివి. ఈ అమ్మ‌డు మ‌హ‌ర్షి సినిమాతో పాటు ప‌లు సినిమాల‌లో కీల‌క పాత్ర‌లు పోషించింది. అయితే బిగ్ బాస్ షో మాత్ర‌మే ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షోలో దివి త‌న అంద‌చందాల‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ఉన్న‌న్ని రోజులు దివి త‌న గ్లామ‌ర్‌తోనే సంద‌డి చేసింది. షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక దివి క్రేజ్ పెరిగింది. ప‌లు సినిమా అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. ఇక అప్పుడ‌ప్పుడు ఫొటో షూట్స్‌తో కూడా అద‌ర‌గొడుతూ ర‌చ్చ చేస్తుంది. దివి తాజాగా న‌టించిన చిత్రం లంబసింగి .

మార్చి 15న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో దివి అనేక ఆస‌క్తికర విష‌యాలు పంచుకుంటుంది. అయితే త‌న జీవితంలో ఘోరమైన అనుభం గురించి తాజాగా చెప్పిన దివి అంద‌రు షాక్ అయ్యేలా చేసింది. దివి తాను మోడ‌లింగ్ నుండి న‌టిగా మారిన‌ట్టు పేర్కొంది. అయితే త‌ను ఎన్నో ఆడిష‌న్స్ ఇచ్చిన‌ట్టు తెలియ‌జేసింది. మొద‌ట్లో చాలా మంది త‌న‌ని రిజెక్ట్ చేశార‌ని, చేతికి వ‌చ్చిన చాలా అవ‌కాశాలు చేజారాయ‌ని పేర్కొంది. ఏదో కార‌ణం చెబుతూ న‌న్ను ఎంపిక చేసిన ప్రాజెక్ట్ నుండి తొల‌గించేవార‌ని పేర్కొంది.

కొంద‌రు న‌న్ను స‌న్న‌గా ఉన్నార‌ని రిజెక్ట్ చేస్తే, మ‌రి కొంద‌రు లావుగా ఉన్నార‌ని రిజెక్ట్ చేసేవాళ్లు. లావుగా ఉన్నార‌ని అన్నందుకు కాస్త స‌న్న‌గా మారితే మ‌రీ ఇంత స‌న్న‌గానా అని అనేవారు. ఓ సారి ర‌వితేజ సినిమాలో న‌న్ను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు. హీరోయిన్ నువ్వే అని కూడా నాకు చెప్పారు. ఐదు రోజుల్లో షూటింగ్ మొద‌లు కానుంద‌ని అనే స‌మ‌యంలో న‌న్ను తొల‌గించారు. ఫోన్ చేస్తాం అన్నారు. ఎలాంటి కాల్ రాలేదు. ఇక న‌న్ను తీసేసార‌ని తెలిసి చాలా ఏడ్చేశాను. బాధ భరించలేక బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసుకుని తడుస్తూ వెక్కి వెక్కి ఏడ్చానంటూ దివి పేర్కొంది. అమ్మ నాన్న‌ల‌కి ఈ విష‌యం తెలిస్తే ఎక్క‌డ బాధ‌ప‌డ‌తారేమోన‌ని సౌండ్ రాకుండా లోప‌ల లోప‌ల ఏడ్చేదానిని అంటూ దివి త‌న బాధ‌లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు మంచి హీరోయిన్‌గా ఎద‌గాల‌ని అనుకుంటుంది.

Ramu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp