Dj Tillu Movie : చిన్న‌సినిమా పెద్ద విజ‌యం… డీజే టిల్లు మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 February 2022,12:00 pm

Dj Tillu Movie :ఇటీవ‌లి కాలంలో కొన్న‌చిన్న సినిమాలు పెద్ద విజ‌యాలు సాధిస్తున్నాయి. తాజాగా సిద్దు జొన్న‌ల‌గ్డ హీరోగా రూపొందిన డీజే టిల్లు చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా మంచి ఆదరణపొందాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో సిద్ధూ యాటిట్యూడ్, హీరోయిన్ అందచందాలు జనాల్లోకి వెళ్లిపోయాయి. మాస్ అంశాలతో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ట్రైలర్‌ను కట్ చేయడంతో ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. తొలి రోజు ఈ చిత్రం మాత్రం ఊహించ‌ని రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టింది.

రవితేజ ఖిలాడి సినిమాకు ఊహించిన టాక్ రాకపోవడంతో మొదటి రోజే తేలిపోయింది ఇది దాంతో టిల్లు రప్ఫాడిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో డిజే టిల్లు మొదటి రోజు 3 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్‌కు.. ఉన్న అంచనాలకు.. చేసిన బిజినెస్‌కు.. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్‌కు ఎక్కడా పొంతన లేదు. తొలి రోజు ఈ సినిమా నైజాం: 1.59 కోట్లు, సీడెడ్: 0.47 కోట్లు, ఉత్తరాంధ్ర: 0.26 కోట్లు, ఈస్ట్: 0.18 కోట్లు, వెస్ట్: 0.14 కోట్లు, గుంటూరు: 0.15 కోట్లు, కృష్ణా: 0.11 కోట్లు, నెల్లూరు: 0.10 కోట్లు సాధించింది.

dj tillu Movie First Day collections

dj tillu Movie First Day collections

Dj Tillu Movie : ర‌ఫ్ఫాడించిన డీజే టిల్లు..

మొత్తంగా ఏపీ, తెలంగాణ ఫస్డ్ డే కలెక్షన్స్: 3.00 కోట్లు సాధించ‌గా, రెస్టాఫ్ ఇండియా: 0.50 కోట్లు, ఓవర్సీస్: 0.90 కోట్లు సాధించింది. మొత్తంగా వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్: 4.40 కోట్లు సాధించిన‌ట్టు స‌మాచారం.కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డ .. డైరెక్టర్ విమల్ కృష్ణ కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు . గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సిద్దు. ఆ తర్వాత కృష్ణ ఎండ్ హిస్ లీల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డీజే టిల్లు గా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

Also read

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి