Chatrapathi chandrashekar : ఛత్రపతి చంద్రశేఖర్ భార్య.. అక్కడ టాప్ హీరోయిన్ అన్న విషయం మీలో ఎవరికైనా తెలుసా..!

Authored By mallesh | The Telugu News | Published on: October 17, 2021, 7:40 pm

Chatrapathi chandrashekar : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎక్కువగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాల్లో కనిపించాడు. నటుడుగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చిన మూవీ మాత్రం ఛత్రపతి.. ఈ మూవీతోనే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్‌ టాలీవుడ్‌లో మకుటం లేని మహరాజుగా ఎదిగాడు. అయితే, ఛత్రపతి సినిమా కంటే ముందు.. ఆ తర్వాత చంద్రశేఖర్ స్టూడెంట్ నెంబర్ -1, సై, సింహాద్రి, విక్రమార్కుడు వంటి చిత్రాల్లోనూ కనిపించాడు. కానీ ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన మూవీ ఛత్రపతి కావడంతో ఆయన్ను అందరూ ఛత్రపతి చంద్రశేఖర్ అని పిలుస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఛత్రపతి చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలీదు. చంద్ర శేఖర్ భార్య కూడా ఆయన లాగే చిత్ర పరిశ్రమలోనే పనిచేస్తుంది. కానీ అందరికీ తెలియని ఇంకొక విషయం ఎంటంటే.. ఆమె సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న నటలలో ఒక్కరు. ఆమె మరెవరో కాదు.. ‘నీలియా భవాని’.. ఈవిడ తెలుగు ఇండస్ట్రీలో నేటి వరకు కిక్ -2, సైరా నరసింహా రెడ్డి, పండగ చేస్కో, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మేన్ మూవీల్లో కీలక పాత్రలను పోషించింది. ఇకపోతే తమిళ ఇండస్ట్రీలోనూ నీలియాకు మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్స్ అజిత్ మరియు విజయ్ సరసన చాలా సినిమాల్లో నటించింది. ఆమె పేరు ఎక్కువగా ఎవరికీ గుర్తుండకపోయినా ఆమె చిత్రాన్ని చూస్తే మాత్రం అందరికీ తెలిసిన ముఖమే అనిపిస్తుంది.

అంతపెద్ద స్టార్ యాక్టర్ అయిన నీలియా, చంద్రశేఖర్ ఎలా ఒక్కటయ్యారో తెలిస్తే షాక్ అవుతారు. ఖమ్మంలో పుట్టిన నీలియా సినీ పరిశ్రమకు రాకముందే చంద్ర శేఖర్‌ను ప్రేమవివాహం చేసుకుంది. ఆ టైంలో చంద్రశేఖర్‌కు ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో హైదరాబాద్‌కు వలస వచ్చారు.చంద్రశేఖర్ కు సినిమాలంటే పిచ్చి కావడంతో అవకాశాల కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. చివరగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం సీరియల్ తో ఆయన కెరీర్ ప్రారంభమైందని చెప్పవచ్చు.

ఆ తర్వాత రాజమౌళితో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారడంతో సినిమా ఆఫర్లు కూడా బానే తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో నీలియా భవాని కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది.అంతా బాగానే నడుస్తుందనులోపే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక్క కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలు నీలియా తోనే ఉంటున్నట్టు తెలిసింది.

mallesh

No bio available for this author.

  1. "Gold Price India : భారతీయులు బంగారం కొనడం ఆపేస్తే ధరలు భారీగా తగ్గుతాయా?.. అసలు నిజం ఇదే!"

  2. "Karthika Pournami 365 Vattula : కార్తీక పౌర్ణమి 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారు?.. ఏ సమయంలో వెలిగిస్తే మంచిదంటే?"

  3. "Jagadish Reddy : తెలంగాణ నీటి హక్కుల కోసం వెళ్తే అరెస్టులా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై జగదీష్ రెడ్డి ఫైర్!"

  4. "Ration Card : బిగ్ న్యూస్‌.. వీరి రేషన్ కార్డులపై వేటు? కీల‌క నిర్ణ‌యం దిశ‌గా కేంద్రం..!"

  5. "India A vs Pakistan A : పాక్ చేతిలో భారత్ ఓటమి.. అభిషేక్ 70, టిలక్ 100.. అయినా ఫ్యాన్స్ ఫైర్..!"

  6. "Puvvada Ajay Kumar : ఖమ్మంలో 800 ఇళ్లు కూల్చి 300 ఇళ్లు కట్టిస్తామంటారా?.. రేవంత్‌పై పువ్వాడ ఫైర్..!"

  7. "Odisha Viral News : బ్యాంకుకు అక్క అస్తిపంజరం మోసుకుని 3.5 కిలోమీటర్లు నడిచాడు.. చివరకు లక్షాధికారిగా మారిన తమ్ముడు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp