RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్ వెన‌క అసలు సీక్రెట్ చెప్పిన ఎస్.ఎస్.రాజమౌళి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్ వెన‌క అసలు సీక్రెట్ చెప్పిన ఎస్.ఎస్.రాజమౌళి..!

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2022,3:50 pm

RRR Movie : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తోన్న ఈ పాన్‌ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ సినిమా విడుదలపై అనుమానులు వ్యక్తం అయినా.. తాజాగా అలాందేమి లేదని చిత్ర యూనిట్ మరోసారి స్పష్టం చేసింది. పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా గురించే చర్చ జరుగుతుంది. జనవరి 7న విడుదల కానున్న ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన.

ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా టైటిల్ కు సంబంధించి దర్శకుడు జక్కన్న ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.సినిమా ప్రమోషన్ కు గానూ బాలీవుడ్ లో అడుగు పెట్టిన రాజమౌళికి అక్కడ ఓ యాంకర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. అసలు సినిమాకి ఆర్ ఆర్ ఆర్ అన్న టైటిల్ ఎందుకు పెట్టారు అని సదరు యాంకర్ అడగగా దానికి రాజమౌళి ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. సినిమాకు అసలు టైటిల్ ఏం పెట్టాలో క్లారిటీ లేకపోవడంతో ఆర్ ఆర్ ఆర్ అని పెట్టామ‌ని చెప్పారు.

SS rajamouli reveals truth buhind rrr movie title

SS rajamouli reveals truth buhind rrr movie title

RRR Movie : ఏం పెట్టాలో తెలియక అదే ఉంచేశాం..:

మొదట వర్కింగ్ టైటిల్ గా పెట్టినా.. రాను రానూ అదే కంటిన్యూ అయిందని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం బృందం.. ప్రమోషన్ కార్యక్రమాలను జోరు మీద చేస్తున్నారు. తాజాగా హిందీలో కపిల్ శర్మ షోలో పాల్గొనగా.. ఇటు సౌత్‌ లో కేరళ, తమిళనాడు అని ఖాళీ అనేదే లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. ఓవరాల్ గా రు. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో ఇంతకుముందు ఉన్న కలెక్షన్ల రికార్డులన్నీ తుడుచుకు పోవడం ఖాయమని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది