Chatrapathi chandrashekar : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎక్కువగా ఎస్ ఎస్ రాజమౌళి తీసిన సినిమాల్లో కనిపించాడు. నటుడుగా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చిన మూవీ మాత్రం ఛత్రపతి.. ఈ మూవీతోనే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్‌లో మకుటం లేని మహరాజుగా ఎదిగాడు. అయితే, ఛత్రపతి సినిమా కంటే ముందు.. ఆ తర్వాత చంద్రశేఖర్ స్టూడెంట్ నెంబర్ -1, సై, సింహాద్రి, విక్రమార్కుడు వంటి చిత్రాల్లోనూ కనిపించాడు. కానీ ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన మూవీ ఛత్రపతి కావడంతో ఆయన్ను అందరూ ఛత్రపతి చంద్రశేఖర్ అని పిలుస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఛత్రపతి చంద్రశేఖర్ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలీదు. చంద్ర శేఖర్ భార్య కూడా ఆయన లాగే చిత్ర పరిశ్రమలోనే పనిచేస్తుంది. కానీ అందరికీ తెలియని ఇంకొక విషయం ఎంటంటే.. ఆమె సౌత్ ఇండియాలోనే మంచి డిమాండ్ ఉన్న నటలలో ఒక్కరు. ఆమె మరెవరో కాదు.. ‘నీలియా భవాని’.. ఈవిడ తెలుగు ఇండస్ట్రీలో నేటి వరకు కిక్ -2, సైరా నరసింహా రెడ్డి, పండగ చేస్కో, నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మేన్ మూవీల్లో కీలక పాత్రలను పోషించింది. ఇకపోతే తమిళ ఇండస్ట్రీలోనూ నీలియాకు మంచి క్రేజ్ ఉంది. సూపర్ స్టార్స్ అజిత్ మరియు విజయ్ సరసన చాలా సినిమాల్లో నటించింది. ఆమె పేరు ఎక్కువగా ఎవరికీ గుర్తుండకపోయినా ఆమె చిత్రాన్ని చూస్తే మాత్రం అందరికీ తెలిసిన ముఖమే అనిపిస్తుంది.
అంతపెద్ద స్టార్ యాక్టర్ అయిన నీలియా, చంద్రశేఖర్ ఎలా ఒక్కటయ్యారో తెలిస్తే షాక్ అవుతారు. ఖమ్మంలో పుట్టిన నీలియా సినీ పరిశ్రమకు రాకముందే చంద్ర శేఖర్‌ను ప్రేమవివాహం చేసుకుంది. ఆ టైంలో చంద్రశేఖర్‌కు ఎలాంటి ఉద్యోగం లేదు. దీంతో హైదరాబాద్‌కు వలస వచ్చారు.చంద్రశేఖర్ కు సినిమాలంటే పిచ్చి కావడంతో అవకాశాల కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. చివరగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం సీరియల్ తో ఆయన కెరీర్ ప్రారంభమైందని చెప్పవచ్చు.
ఆ తర్వాత రాజమౌళితో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారడంతో సినిమా ఆఫర్లు కూడా బానే తలుపుతట్టాయి. ఈ క్రమంలోనే భర్త ప్రోత్సాహంతో నీలియా భవాని కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అతి తక్కువ టైంలోనే మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది.అంతా బాగానే నడుస్తుందనులోపే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక్క కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం పిల్లలు నీలియా తోనే ఉంటున్నట్టు తెలిసింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.