Ammoru : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మోరు. అప్పటి వరకు వచ్చిన కమర్షియల్ అండ్ మాస్, కామెడీ, ఫ్యామిలీ జోనర్ సినిమాలకి భిన్నంగా భక్తి ప్రధానమైన కథాంశంతో అమ్మోరు తెరకెక్కించారు. 1995లో వచ్చిన ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ అమ్మోరు సినిమాకి కథ సిద్ధం చేశారు. దీనికి ప్రముఖ రచయిత సత్యానంద్ మాటలు రాశాడు. తండ్రీ కొడుకులు చక్రవర్తి, శ్రీ కొమ్మినేని అమ్మోరు చిత్రానికి సంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల
అమ్మోరులో పాటలు కూడా రాయడం విశేషం.
do you know about ammoru-reshoot
అయితే ఓ హాలీవుడ్ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అలా గ్రాఫిక్స్ వాడి తెలుగులో సినిమాను నిర్మించాలనుకున్నారు. తన టీం కి పాయింట్ చెప్పి కథ రాయమని సూచించారు. అలాగే మల్లెమాల యూనిట్ కథ సిద్ధం చేసింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామి రెడ్డి వద్ద దర్శకత్వ విభాగంలో పని చేస్తున్న రామారావును దర్శకుడిగా పెట్టుకున్నారు. అప్పుడు సౌందర్య మనవరాలి పెళ్ళి అనే సినిమా చేస్తోంది. అందులో బాబు మోహన్ కి మరదలిగా చేసింది. దాంతో బాబు మోహన్ అమ్మోరు సినిమాకి సౌందర్య అయితే పర్‌ఫెక్ట్ గా సూటవుతుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చెప్పగా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి ఆమెని చూసి ఓకే చేసుకున్నారు. అలాగే అప్పటి వరకు గ్లామర్ రోల్స్ లో నటించిన రమ్యకృష్ణని అమ్మోరు పాత్రకి ఎన్నుకున్నారు.
మంచి ఫాంలో ఉన్న సురేష్ ని హీరోగా చిన్నాని విలన్ పాత్రకి ఎంచుకున్నారు. 1992లో అమ్మోరు షూటింగ్ ప్రారంభించి 18 నెలలు చిత్రీకరణ జరిపారు. ఆ ఫూటేజ్ తీసుకొని నిర్మాత శ్యామ్ ప్రసాద్ విదేశాలకి వెళ్ళారు. అయితే గ్రాఫిక్స్ కి అది పనికిరాదని వాళ్ళు చెప్పడంతో ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ ఫుటేజీ మొత్తాన్ని పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అమ్మోరు సినిమాను మొదలు పెట్టారు. అయితే చిన్నా స్థానంలో రామిరెడ్డిని విలన్ పాత్రకి తీసుకున్నారు. దాదాపు 270 రోజులు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈసారి ఫూటేజీని విదేశాలకి తీసుకు వెళ్ళకుండా అక్కడి వారినే ఇక్కడికి తీసుకువచ్చి గ్రాఫిక్స్ చేయించారు. అద్భుతంగా ఔట్ పుట్ వచ్చింది. 1995 నవంబర్ 23న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇదే జోనర్ లో చాలా సినిమాలొచ్చాయి.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.