Ammoru : అమ్మోరు సినిమా రీషూట్ ఎందుకు చేయాల్సి వచ్చింది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ammoru : అమ్మోరు సినిమా రీషూట్ ఎందుకు చేయాల్సి వచ్చింది…

 Authored By govind | The Telugu News | Updated on :31 July 2021,8:00 am

Ammoru : కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మోరు. అప్పటి వరకు వచ్చిన కమర్షియల్ అండ్ మాస్, కామెడీ, ఫ్యామిలీ జోనర్ సినిమాలకి భిన్నంగా భక్తి ప్రధానమైన కథాంశంతో అమ్మోరు తెరకెక్కించారు. 1995లో వచ్చిన ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ పతాకంపై ఎం. ఎస్. రెడ్డి సమర్పణలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ అమ్మోరు సినిమాకి కథ సిద్ధం చేశారు. దీనికి ప్రముఖ రచయిత సత్యానంద్ మాటలు రాశాడు. తండ్రీ కొడుకులు చక్రవర్తి, శ్రీ కొమ్మినేని అమ్మోరు చిత్రానికి సంగీతాన్నందించారు. ఈ చిత్ర సమర్పకుడైన మల్లెమాల
అమ్మోరులో పాటలు కూడా రాయడం విశేషం.

do you know about ammoru reshoot

do you know about ammoru-reshoot

అయితే ఓ హాలీవుడ్ సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అలా గ్రాఫిక్స్ వాడి తెలుగులో సినిమాను నిర్మించాలనుకున్నారు. తన టీం కి పాయింట్ చెప్పి కథ రాయమని సూచించారు. అలాగే మల్లెమాల యూనిట్ కథ సిద్ధం చేసింది. దీనికి ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామి రెడ్డి వద్ద దర్శకత్వ విభాగంలో పని చేస్తున్న రామారావును దర్శకుడిగా పెట్టుకున్నారు. అప్పుడు సౌందర్య మనవరాలి పెళ్ళి అనే సినిమా చేస్తోంది. అందులో బాబు మోహన్ కి మరదలిగా చేసింది. దాంతో బాబు మోహన్ అమ్మోరు సినిమాకి సౌందర్య అయితే పర్‌ఫెక్ట్ గా సూటవుతుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డితో చెప్పగా షూటింగ్ స్పాట్ కి వెళ్ళి ఆమెని చూసి ఓకే చేసుకున్నారు. అలాగే అప్పటి వరకు గ్లామర్ రోల్స్ లో నటించిన రమ్యకృష్ణని అమ్మోరు పాత్రకి ఎన్నుకున్నారు.

Ammoru : దాదాపు 270 రోజులు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.

మంచి ఫాంలో ఉన్న సురేష్ ని హీరోగా చిన్నాని విలన్ పాత్రకి ఎంచుకున్నారు. 1992లో అమ్మోరు షూటింగ్ ప్రారంభించి 18 నెలలు చిత్రీకరణ జరిపారు. ఆ ఫూటేజ్ తీసుకొని నిర్మాత శ్యామ్ ప్రసాద్ విదేశాలకి వెళ్ళారు. అయితే గ్రాఫిక్స్ కి అది పనికిరాదని వాళ్ళు చెప్పడంతో ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ ఫుటేజీ మొత్తాన్ని పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో అమ్మోరు సినిమాను మొదలు పెట్టారు. అయితే చిన్నా స్థానంలో రామిరెడ్డిని విలన్ పాత్రకి తీసుకున్నారు. దాదాపు 270 రోజులు ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. ఈసారి ఫూటేజీని విదేశాలకి తీసుకు వెళ్ళకుండా అక్కడి వారినే ఇక్కడికి తీసుకువచ్చి గ్రాఫిక్స్ చేయించారు. అద్భుతంగా ఔట్ పుట్ వచ్చింది. 1995 నవంబర్ 23న విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇదే జోనర్ లో చాలా సినిమాలొచ్చాయి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది