Arvind Swamy : హీరో అరవింద్ స్వామి భార్య సంపాదన ఎంతో తెలుసా? నోరెళ్లబెట్టాల్సిందే..
Arvind Swamy : అరవింద్ స్వామి గురించి ఇండస్ట్రీలో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బొంబాయి, రోజా వంటి మూవీస్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ మూవీస్ తెలుగులోనూ పెద్ద హిట్ సాధించాయి. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నాయి. ఈ మూవీలతో అమ్మాయిల గుండెల్లో రాజకుమారుడిగా నిలిచాడు అరవింద స్వామి.. అప్పట్లో అరవింద్ స్వామి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కానీ రాను రానూ అది చాలా తగ్గింది. ఆయన యాక్ట్ చేసిన మూవీస్ పెద్దగా సక్సెన్ అందుకోలేకపోయాయి.
దీంతో నెమ్మదిగా అతడు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. తన బిజినెస్ చూసుకుంటూ ఉండిపోయాడు. తర్వాత తనిఒరువన్ అనే తమిళ్ మూవీలో స్టైలిష్ విలన్ గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని తెలుగులో రామ్ చరణ్ తేజ్ హీరోతో తెరకెక్కించారు. తర్వాత తలైవి మూవీలో ఎంజీఆర్ రోల్ లో యాక్ట్ చేశాడు అరవింద స్వామి.ఆయన భార్య అపర్ణ ముఖర్జీ గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. ఆమె సంపాదన, లైఫ్ స్టైల్ వంటి ఇంట్రస్టింగ్ విషయాలపై చర్చలు మొదలయ్యాయి.
Arvind Swamy : నెలకు సుమారు 30 నుంచి 40 కోట్లు..
దేశంలో ఉన్న ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు అపర్ణ ముఖర్జీ. విదేశాల్లోనూ వాదించే లైసెన్స్ ఉంది ఆమెకు. దేశంలోని పలు కార్పొరేట్ కంపెనీలకు సేవలందిస్తుంటారు. అరవింద స్వామికి చెందిన పలు కంపెనీలకు బోర్డు డైరెక్టర్ గానూ, బయట కంపెనీలకు లీగల్ సలహాదారులుగా ఉంటూ భారీగానే ఆర్జిస్తున్నారు.. నెలకు సుమారుగా రూ.30 నుంచి రూ.40 కోట్లు సంపాదిస్తున్నారట. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఓ స్టార్ హీరో భార్య అయి ఈ రెంజ్ లో సంపాదిస్తుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అనేక చర్చలు మొదలయ్యాయి.