Do you know how much Hansika spent for shobhanam
Hansika : అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్, బాలీవుడ్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక మోత్వానీ ఎట్టకేలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను వివాహంచేసుకోగా, ఈ వేడుకకి చాలా మంది సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి పెళ్లికి ఎంత ఖర్చు అయిందనే విషయంపై చర్చ నడుస్తుంది. అయితే వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా కాగా,హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నే నిర్వహించారు.
హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని ప్రచారం జరుగుతుంది. ఇక మొదటి రాత్రికి సంబంధించిన డెకరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఫస్ట్ నైట్ కోసం ఏకంగా 100 రకాల పూలను ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించుకొని అలంకరించుకోగా, దీనికే ఎక్కువ ఖర్చు అయిందట. పూల కోసమే దాదాపు 50 లక్షలకు పైగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. లైఫ్ లో ఒకేసారి వచ్చే ఇలాంటి స్పెషల్ అకేషన్ కోసం ఎంత ఖర్చు చేసినా
Do you know how much Hansika spent for shobhanam
తక్కువే అని ఈ జంట భావించడంతో వారు ఇంత ఖర్చు చేసినట్టు టాక్. ఇక హన్సిక సోహైల్ వివాహం రాజస్థాన్ జైపూర్ లోని పురాతనమైనటువంటి ముంటోడా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, హన్సికకు సోహైల్ తో మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఈయన హన్సిక స్నేహితురాలిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన అనంతరం హన్సికను వివాహం చేసుకున్నాడు. సోహైల్ తనకు బిజినెస్ పార్ట్నర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి వరకు వచ్చినట్టు తెలుస్తుంది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.