Hansika : శోభనం కోసం హన్సిక ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా .. పెళ్ళికి కూడా అంత ఖర్చు అవ్వలేదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika : శోభనం కోసం హన్సిక ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా .. పెళ్ళికి కూడా అంత ఖర్చు అవ్వలేదు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :9 December 2022,6:30 pm

Hansika : అందాల ముద్దుగుమ్మ హ‌న్సిక గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సౌత్, బాలీవుడ్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ హన్సిక మోత్వానీ ఎట్ట‌కేల‌కు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఆమె డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను వివాహంచేసుకోగా, ఈ వేడుక‌కి చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. వీరి పెళ్లికి ఎంత ఖ‌ర్చు అయింద‌నే విష‌యంపై చ‌ర్చ న‌డుస్తుంది. అయితే వీరిద్దరి వివాహం మూడు రోజుల ముందు నుంచే చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా కాగా,హల్దీ, సంగీత్, మెహందీ ఫంక్షన్లు కూడా గ్రాండ్‌గా నే నిర్వహించారు.

హన్సిక తన వివాహం కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయంపై అభిమానులు ఆరా తీయగా.. ఈ క్రమంలోనే హన్సిక పెళ్లి కోసం దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇక మొదటి రాత్రికి సంబంధించిన డెకరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫస్ట్ నైట్ కోసం ఏకంగా 100 రకాల పూలను ప్రత్యేకంగా ఫారిన్ కంట్రీస్ నుంచి తెప్పించుకొని అలంకరించుకోగా, దీనికే ఎక్కువ ఖ‌ర్చు అయింద‌ట‌. పూల కోస‌మే దాదాపు 50 లక్షలకు పైగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తుంది. లైఫ్ లో ఒకేసారి వచ్చే ఇలాంటి స్పెషల్ అకేషన్ కోసం ఎంత ఖర్చు చేసినా

Do you know how much Hansika spent for shobhanam

Do you know how much Hansika spent for shobhanam

Hansika : అంత ఖ‌ర్చు చేశారా..

తక్కువే అని ఈ జంట భావించ‌డంతో వారు ఇంత ఖ‌ర్చు చేసిన‌ట్టు టాక్. ఇక హన్సిక సోహైల్ వివాహం రాజస్థాన్ జైపూర్ లోని పురాతనమైనటువంటి ముంటోడా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కాగా, హన్సికకు సోహైల్ తో మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండవ వివాహం కావడం విశేషం. ఈయన హన్సిక స్నేహితురాలిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన అనంతరం హన్సికను వివాహం చేసుకున్నాడు. సోహైల్ తనకు బిజినెస్ పార్ట్నర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి వ‌ర‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది