Okkadu Movie Child Artist : సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ కెరియర్ ను ప్రారంభించి ఇప్పుడు హీరో హీరోయిన్లు గా చేస్తున్నారు. మరికొందరు ఒకటి రెండు సినిమాలను చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు. అయితే ప్రేక్షకులకు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినవాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే ప్రస్తుత కాలంలో అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా పని చేసిన చాలామంది ఫోటోలు సోషల్ మీడియాలో రోజు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో మహేష్ బాబు సినిమాలో నటించిన ఓ అమ్మాయి అందరికీ బాగానే గుర్తుండే ఉంటుంది.
అయితే 2003లో మహేష్ బాబు హీరోగా విడుదలైన “సినిమా” సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా భూమిక నటించింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా ఓ అమ్మాయి నటించిన విషయం మనకు తెలిసిందే. ఆమె పేరు నిహారిక. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు చెల్లెలుగా ఆశ అనే క్యారెక్టర్ లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇక ఈ పాత్ర నిహారికకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే నిహారిక ఈ సినిమా కంటే ముందే మోహన్ బాబు హీరోగా నటించిన యమజాతకుడు అనే సినిమాలో హీరోకి మేనకోడలిగా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “ప్రేమించుకుందాం రా” అనే సినిమాలో కూడా నిహారిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది.
దీంతో నిహారికకు చాలా సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్ ఆఫర్లు వచ్చాయి. కానీ నిహారిక వీటికి నో చెప్పి తన చదువుల పైన ఫోకస్ పెట్టింది. ఇక ఇప్పుడు తన చదువు పూర్తి చేసుకున్న నిహారిక మరల ఇప్పుడు సినీ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. దీనిలో భాగంగా ఇటీవల నిహారిక ఓ ఫోటో షూట్ కూడా చేసింది. దీంతో ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక ఈమెను చూసిన ప్రముఖ దర్శకుడు తనకు అవకాశం ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకొన్ని రోజుల్లో నే తను హీరోయిన్గా మన ముందు కనిపించబోతుందని సమాచారం. చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ఇప్పుడు హీరోయిన్ గా ఛాన్స్ ల కోసం చూస్తున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ ను ఎలా మొదలు పెడుతుందో వేచి చూడాలి.
Mahesh Babu : టాలీవుడ్ Tollywood సూపర్స్టార్ ప్రిన్స్ మహేశ్బాబు Prince Mahesh babu గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన…
Ration Cards : రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, అర్హులైన వారందరికీ వాటిని అందిస్తామని Telangana తెలంగాణ…
AP Politics : Andhra pradesh ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ TDP నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేవర చిత్రంతో Devara…
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా Amit Shah పర్యటన ఏపీలో బిజీ బిజీగా నడుస్తుంది.…
Makhana : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ఆహారం. ఈ ఫుల్ మఖానా Makhana పోషక విలువలను కలిగి ఉన్న…
Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో గొడవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు ఇద్దరు కొడుకు…
Diabetes : నానాటికి షుగర్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. శరీరంలో చక్కెర స్థాయిలో పెరిగినా, తగ్గినా శరీరంపై త్రీవ్రమైన…
This website uses cookies.