Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి కోరిక ఇదే.. తీరకుండానే..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఆఖరి కోరిక ఇదే.. తీరకుండానే..??

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే విషయాన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన మరణం ఒక్కసారిగా తన అభిమానులను కుంగ దీసింది. తెలుగు సినీ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించిన కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజానికి సూపర్ స్టార్ కృష్ణకు పెద్దగా కోరికలు ఏం లేదు. ఆయన తన 80 ఏళ్ల జీవితంలో చాలా విజయాలను చూశారు. తన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 November 2022,4:20 pm

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే విషయాన్ని తెలుగు సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన మరణం ఒక్కసారిగా తన అభిమానులను కుంగ దీసింది. తెలుగు సినీ చరిత్రలో ఒక చరిత్రను సృష్టించిన కృష్ణ మరణం ఆయన అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నిజానికి సూపర్ స్టార్ కృష్ణకు పెద్దగా కోరికలు ఏం లేదు. ఆయన తన 80 ఏళ్ల జీవితంలో చాలా విజయాలను చూశారు. తన కొడుకు కూడా సూపర్ స్టార్ అవడంతో కృష్ణ చాలా సంతోషించారు.ఎన్నో విజయాలను చూసిన సూపర్ స్టార్ కృష్ణ..

తన జీవిత చరమాంకంలో అనారోగ్యంతో మాత్రం చాలా బాధపడ్డారు. చాలా ఏళ్ల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలాసార్లు ట్రీట్ మెంట్ చేసినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు.తన భార్య మరణించిన కొన్ని రోజులకే కృష్ణ కూడా మరణించారు. అయితే.. ఆయనకు ఒక చిన్న కోరిక మాత్రం అలాగే తీరకుండానే ఉండిపోయిందట. తను చనిపోయే లోపు ఆ కోరిక తీరాలని కృష్ణ చాలా ఆరాటపడ్డారట.

do you know what is super star krishna last wish

do you know what is super star krishna last wish

Superstar Krishna : మహేశ్ బాబు కొడుకును హీరోగా చూసి ఉంటే?

కానీ.. ఆ కోరిక తీరకుండానే కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంతకీ ఆ కోరిక ఏంటంటే.. తన కొడుకు మహేశ్ బాబు కొడుకు గౌతమ్ బాబును హీరోగా చూడాలనుకున్నారట. నిజానికి.. గౌతమ్ ఇప్పటికే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. తన సత్తాను చాటాడు. కానీ.. హీరోగా అవ్వడం.. మహేశ్ అంత గొప్ప హీరో అవడం చూసి తరించాలని కృష్ణ భావించారట. కానీ.. ఇంకా ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. దీంతో తన మనవడు హీరో అవడం చూడకుండానే కృష్ణ కన్నుమూశారని కృష్ణ, మహేశ్ అభిమానులు వాపోతున్నారు. ఘట్టమనేని గౌతమ్ బాబు కూడా మహేశ్ బాబు అంత గొప్ప హీరో అవ్వడం కూడా చూసి ఉంటే కృష్ణ ఆత్మ మరింత శాంతించేదని చెబుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది