Pawan Kalyan Fans – Sujeeth : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజీత్ ఏం చేసాడో తెలుసా .. మీరు నమ్మలేరు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan Fans – Sujeeth : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజీత్ ఏం చేసాడో తెలుసా .. మీరు నమ్మలేరు !

Pawan Kalyan Fans – Sujeeth : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ కి అభిమానులు. దర్శకుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ తెలియజేయడం జరిగింది. “గబ్బర్ సింగ్” సినిమా హిట్ అయిన సమయంలో ఫస్ట్ షో చూసి సుజిత్ థియేటర్ నుండి బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్న వీడియోని.. సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. “OG” సినిమా ప్రకటన […]

 Authored By sekhar | The Telugu News | Updated on :25 April 2023,7:00 pm

Pawan Kalyan Fans – Sujeeth : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది దర్శకులు పవన్ కళ్యాణ్ కి అభిమానులు. దర్శకుడు సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ శంకర్ తెలియజేయడం జరిగింది. “గబ్బర్ సింగ్” సినిమా హిట్ అయిన సమయంలో ఫస్ట్ షో చూసి సుజిత్ థియేటర్ నుండి బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్న వీడియోని.. సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. “OG” సినిమా ప్రకటన సమయంలో హరీష్ ఈ రీతిగా సుజిత్ పవన్ వీరాభిమాని అనీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం “OG” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబైలో మొదటి షెడ్యూల్ భారీగా జరుగుతూ ఉంది.

Do you know what Sujeeth did for Pawan Kalyan fans

Do you know what Sujeeth did for Pawan Kalyan fans

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ పవన్ అభిమానులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ సుజిత్ అన్ని దగ్గరుండి విడుదల చేస్తూ ఉన్నారు. “OG” సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన స్టిల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకంగా పవన్ పక్కన ఎటువంటి హీరోయిన్ అయితే సూట్ అవుతుంది.. అనే కోణంలో కొంతమంది అభిమానులతో OG స్టార్ట్ చేయక ముందు డైరెక్టర్ సుజిత్ డిస్కషన్ చేసి..ప్రియాంక అరుల్ మోహన్ నీ సెలెక్ట్ చేయడం జరిగిందంట.

Pawan Kalyan Teams Up With Saaho Director Sujeeth For His Next | Deets  Inside

ఈ రీతిగా సినిమా స్టార్ట్ అయ్యాక స్టిల్స్ రిలీజ్ చేయడం అంతకుముందు నటీనటులను ఎంచుకోవడంతో పాటు ఫైట్స్ విషయంలో కూడా… చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగిందంట. “OG”లో అన్ని కూడా అభిమానులు కోరుకునే విధంగా ఉండే రీతిలో పవన్ అభిమానిగా దర్శకుడు సుజిత్ చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇదే సమయంలో కొన్ని లొకేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఫేస్ కట్ కి ఎలా ఉంటుంది అనేది సినిమా యూనిట్ వెళ్లక ముందే స్పెషల్ ఫోటోషూట్స్ తనపై చేసుకుని హీరో ఎలా ఉంటాడో అనేది… టెక్నికల్ గా చూసుకుంటూ చాలా ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుపై డైరెక్టర్ సుజిత్ శ్రద్ధ తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ “OG” రూపంలో ఇవ్వటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది