Home » Entertainment » Do You Know Who Gave Megastar To Chiranjeevi
Entertainment

Chiranjeevi : చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అప్పట్లో ఏం జరిగిందంటే?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 9, 2022, 9:30 pm
Advertisement

Chiranjeevi : గత 20 ఏళ్ల నుంచి తెలుగ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు చిరంజీవి. ఖైదీ సినిమా నుంచి మొన్నది ఉయ్యాల వాడ నరసింహరెడ్డి సినిమా వరకు చిరంజీవి ఎన్నో బెస్ట్ సినిమాలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. అందులో కొన్ని తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టాయి. చిరంజీవి అనగానే మనకు గుర్తొచ్చేది మెగాస్టార్ అనే బిరుదు.కానీ.. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు.. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో? ఆయనకు మెగాస్టార్ అనే బిరుదు వచ్చే నాటికి చిరంజీవితో పాటు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. కానీ.. చిరంజీవికే మెగాస్టార్ అనే బిరుదు ఎందుకు వచ్చింది? అసలు..

Advertisement

ఆ బిరుదును ఎవరు ఇచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.మెగాస్టార్ చిరంజీవి అనగానే స్వయంకృషితో ఎదిగిన నటుడు అంటుంటారు. ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నా.. వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. చిరంజీవి మాత్రం ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగాడు. అయితే.. చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఒక నిర్మాత ఇచ్చారు. ఆయన ఎవరో కాదు.. కేఎస్ రామారావు.చిరంజీవితో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో రామారావు చాలా సినిమాలు చేశాడు. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్ లాంటి అగ్ర హీరోలు రాజ్యమేలుతున్నా.. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు చిరంజీవి.

do you know who gave megastar to chiranjeevi

Advertisement

Chiranjeevi : స్వయంకృషితో ఎదిగిన నటుడు చిరంజీవి

అదే సమయంలో చిరంజీవితో రామారావు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీశాడు.వాళ్ల కాంబోలో వచ్చిన తొలి సినిమా అభిలాష. ఆ తర్వాత ఛాలెంజ్ మూవీ వచ్చింది. రాక్షసుడు, మరణ మృదంగం లాంటి సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరణ మృదంగం అనే సినిమాతోనే చిరంజీవికి తన పేరు ముందు మెగాస్టార్ అనే బిరుదు వచ్చింది.అప్పటి వరకు చిరంజీవి సుప్రీం హీరో అనే బిరుదుతో ఉండేవాడు. ఆ తర్వాత మెగాస్టార్ గా.. రామారావు తన బిరుదును మార్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి పేరు ముందు ఆ మెగాస్టార్ అలాగే ఉండిపోయింది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి