Actor Sunil Wife : తెలుగు నటుడు సునీల్ భార్య ఎవరో తెలుసా? తను ఏం చేస్తుందో తెలుసా?
Actor Sunil Wife : తెలుగు నటుడు సునీల్ తెలుసు కదా. కమెడియన్ గా తెలుగు ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. హీరోగా ఎదిగి చివరకు విలన్ గానూ ఎన్నో పాత్రలు పోషించాడు. తాజాగా విడుదలైన ఎఫ్ 3 సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ లో కమెడియన్ గా నటించాడు సునీల్. అలాగే.. ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాల్లో నటించి హిట్ కొట్టాడు. ఏకంగా ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాలో హీరోగా చేసి శెభాష్ అనిపించుకున్నాడు సునీల్.
do you know who is actor sunil wife and what is does
సునీల్ ది ఏపీలోని బీమవరం అని అందరికీ తెలుసు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సునీల్ కు సినిమాలు అంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానం. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాడు సునీల్. సినిమా మీద పిచ్చి ప్రేమతో ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Actor Sunil Wife : సునీల్ కు ఎంత మంది పిల్లలో తెలుసా?
సునీల్ సినీ ప్రస్థానం గురించి అందరికీ తెలుసు కానీ.. సునీల్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలామందికి తెలియదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే సునీల్ పెళ్లి జరిగింది. సునీల్ చిన్నవయసులోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తన తల్లే సునీల్ ను పెంచి పెద్ద చేసింది. సునీల్ భార్య పేరు శృతి. సునీల్ కు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.