Salaar : సలార్ .. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా సలార్ ఫస్ట్ షెడ్యూల్ రామగుండం లోని బొగ్గుగనులలో పూర్తి చేశారు. పదిరోజుల పాటు జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేశారని తెలిసింది. ప్రభాస్ ఈ సినిమాలో రెండు రకరకాల గెటప్ లలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే రామగుండంలో ప్రభాస్ సలార్ పాత్రలో కనిపించిన ఆన్ లొకేషన్స్ ఫోటోలు లీకయ్యి హాట్ టాపిక్ గా మారాయి.
అంతేకాదు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో సలార్ మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఇలాంటి లీకులుండవని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతలోనే మరొక ఫోటో తాజాగా లీకై మేకర్స్ కి చమటలు పట్టిస్తోంది. దర్శక, నిర్మాతలు చిత్ర యూనిట్ కి కఠినంగా చెప్పినప్పటికీ మళ్ళీ ఈ పిక్ ఎలా లీకయిందో అర్థం కావడం లేదంటూ తలలు బాదుకుంటున్నారట. ఈ మధ్య భారీ సినిమాలకి సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్స్ ఇలా సోషల్ మీడియాలో లీకై మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి.
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి ఇదే సమస్య. సుకుమార్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదో ఒక లీక్ వస్తూనే ఉంది. ఇక మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కి ఇలాంటి సమస్యే ఎదురైంది. మరి ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక.. చిత్ర యూనిట్ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసేందుకు ఇలా లీకులిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. అయితే సలార్ మేకర్స్ .. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకండి… కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ.. సీరియస్ గా చెబుతున్నారట. కాగా ప్రభాస్ బొగ్గుగనుల ప్రదేశంలో బుల్లెట్ బైక్ పై కూర్చున్న పిక్ లీక్ అయి వైరల్ అవుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.