Salaar : సలార్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. ఇలా వార్నింగ్ ఇచ్చిందెవరో తెలుసా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salaar : సలార్ విషయంలో జాగ్రత్తగా ఉండండి.. ఇలా వార్నింగ్ ఇచ్చిందెవరో తెలుసా ..?

 Authored By govind | The Telugu News | Updated on :13 February 2021,3:40 pm

Salaar : సలార్ .. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా సలార్ ఫస్ట్ షెడ్యూల్ రామగుండం లోని బొగ్గుగనులలో పూర్తి చేశారు. పదిరోజుల పాటు జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేశారని తెలిసింది. ప్రభాస్ ఈ సినిమాలో రెండు రకరకాల గెటప్ లలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. కాగా ఇప్పటికే రామగుండంలో ప్రభాస్ సలార్ పాత్రలో కనిపించిన ఆన్ లొకేషన్స్ ఫోటోలు లీకయ్యి హాట్ టాపిక్ గా మారాయి.

do you know who warned about salaar movie

do you know who warned about salaar movie

అంతేకాదు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో సలార్ మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఇలాంటి లీకులుండవని చెప్పుకొస్తున్నారు. అయితే ఇంతలోనే మరొక ఫోటో తాజాగా లీకై మేకర్స్ కి చమటలు పట్టిస్తోంది. దర్శక, నిర్మాతలు చిత్ర యూనిట్ కి కఠినంగా చెప్పినప్పటికీ మళ్ళీ ఈ పిక్ ఎలా లీకయిందో అర్థం కావడం లేదంటూ తలలు బాదుకుంటున్నారట. ఈ మధ్య భారీ సినిమాలకి సంబంధించిన ఆన్ లొకేషన్ పిక్స్ ఇలా సోషల్ మీడియాలో లీకై మేకర్స్ ని టెన్షన్ పెడుతున్నాయి.

Salaar : సలార్ కి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి లీకులు ఇవ్వకండి..?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి ఇదే సమస్య. సుకుమార్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఏదో ఒక లీక్ వస్తూనే ఉంది. ఇక మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కి ఇలాంటి సమస్యే ఎదురైంది. మరి ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక.. చిత్ర యూనిట్ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసేందుకు ఇలా లీకులిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. అయితే సలార్ మేకర్స్ .. ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కి సంబంధించి ఎలాంటి లీకులు ఇవ్వకండి… కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ.. సీరియస్ గా చెబుతున్నారట. కాగా ప్రభాస్ బొగ్గుగనుల ప్రదేశంలో బుల్లెట్ బైక్ పై కూర్చున్న పిక్ లీక్ అయి వైరల్ అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది