Bhuma Mounika Reddy : భూమా మౌనికకి అంత ఆస్తి ఉందా.. మనోజ్ ఆస్తి ఆమెకు అవసరం లేదా..?
ప్రధానాంశాలు:
Bhuma Mounika Reddy : భూమా మౌనికకి అంత ఆస్తి ఉందా.. మనోజ్ ఆస్తి ఆమెకు అవసరం లేదా..?
Bhuma Mounika Reddy : మంచు ఫ్యామిలీలో గొడవల గురించి అందరికీ తెలిసిందే. మంచు మనోజ్ ని ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు, విష్ణు అడ్డు పడటంతో మీడియా సమక్షంలో గొడవకి దిగాడు మనోజ్. ఆ తర్వాత మీడియా పర్సన్ ని మోహన్ బాబు కొట్టడం నానా రచ్చ జరగడం తెలిసిందే. ఐతే మోహన్ బాబు ఈ విషయంలో అటు విష్ణుకి, ఇటు మనోజ్ మధ్య నలిగిపోతున్నాడు. చెప్పడానికి విష్ణు వైపు తాను ఉండి మనోజ్ ని మందలిస్తున్నట్టుగా ఉన్నా లోపల ఏదో జరుగుతుందని అర్ధమవుతుంది.
ఐతే మనోజ్ లైఫ్ లోకి భూమా మౌనిక వచ్చినప్పటి నుంచి మోహన్ బాబు ఫ్యమిలీలో ఈ గొడవలు మొదలైనట్టు తెలుస్తుంది. ఐతే మనోజ్ ఆస్తి మీద కన్నేసిన భూమా మౌనిక కావాలని మనోజ్ ని ఫ్యామిలీ మీదకు రెచ్చగొడుతుందని అంటున్నారు. కానీ భూమా మౌనిక బ్యాక్ గ్రౌండ్ తెలిసిన వారు ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు.
Bhuma Mounika Reddy పొలాలు, స్థలాలు, బిల్డింగులు..
భూమా మౌనిక రెడ్డి రాజకీయ నేత భూమా అఖిల ప్రియ చెల్లి అన్న విషయం తెలిసిందే. మౌనిక పేరు మీద ఎన్నో వందల కోట్ల ఆస్తి ఉంది. అంతేకాదు మొదటి భర్త నుంచి ఆమె భరణం కింద 250 కోట్లు అందుకుంది. అంతేకాదు పొలాలు, స్థలాలు, బిల్డింగులు ఇలా అన్ని చోట్లా కూడా మౌనికకు భారీ ఆస్తులు ఉన్నాయి. వీటి ద్వారా భూమా మౌనికకు దాదాపు 2000 కోట్ల దాకా ఆస్తి ఉన్నట్టు తెలుస్తుంది.
మరి అంత ఆస్తి ఉన్న ఆమె ఇలా మనోజ్ ఫ్యామిలీ గొడవలకు కారణం అవుతుందని చెప్పలేం. ఐతే మనోజ్ కి భూమా మౌనిక సపోర్ట్ గా ఉంటూ వస్తుంది. అతని కెరీర్ లో వెనకపడ్డా కూడా మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. అంతేకాదు ఇద్దరు కలిసి ఒక బిజినెస్ కూడా చేయాలని అనుకున్నారు. ఇంత సపోర్ట్ గా ఉన్న మౌనిక గురించి మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలకు ఆమె కారణమని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. Bhuma Mounika Reddy, Manchu Manoj, Mohan Babu, Manoj Property, Tollywood