Manchu Manoj : రెండో భార్య పెళ్లి చీరలో వస్తూ ఉంటే మనోజ్ ఫిదా.. వైరల్ వీడియో..!!
Manchu Manoj : మార్చి మూడవ తారీకు హైదరాబాద్ ఫిలింనగర్ లో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంటిలో మంచు మనోజ్ భూమా మౌనిక ల పెళ్లి జరగటం తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమానికి సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మనోజ్ అక్క లక్ష్మీ ప్రసన్న బాధ్యత తీసుకుని.. చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో తన పెళ్లి విషయంలో అక్క తీసుకున్న బాధ్యత పట్ల కృతజ్ఞత
తెలుపుతూ సోషల్ మీడియాలో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్టు కూడా పెట్టడం జరిగింది.అయితే ఈ రెండో పెళ్లికి సంబంధించి వీడియో లేటెస్ట్ గా మంచు లక్ష్మి ప్రసన్న తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో భూమా మౌనిక కట్టుకున్న చీర చాలా హైలెట్ గా నిలిచింది. నిండైన పట్టుతోపాటు ఆమె ముఖం పై గోల్డెన్ ఆభరణాలతో అలంకరించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ క్రమంలో పెళ్లి పీటల వద్దకు భూమా మౌనిక వస్తూ ఉన్న సమయంలో మంచి మనోజ్ ఎక్స్ప్రెషన్ వీడియోలో హైలెట్ గా నిలిచింది. ఇక తమ్ముడు మంచు మనోజ్ నీ పెళ్ళికొడుకు చేసిన విధానం… అతనికి పెళ్లి బట్టలు అన్నిటిని కూడా వీడియోలో అద్భుతంగా చూపించారు. వీడియోలో చాలావరకు మంచు లక్ష్మీ ప్రసన్న దగ్గర ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నారు.