Samantha : అజ్ఞాతంలోకి వెళ్లింద‌నుకున్న అభిమానులు.. స‌మంత అక్క‌డ క‌నిపించే స‌రికి నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : అజ్ఞాతంలోకి వెళ్లింద‌నుకున్న అభిమానులు.. స‌మంత అక్క‌డ క‌నిపించే స‌రికి నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత..నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని అతని నుండి విడిపోయిన త‌ర్వాత మ‌యోసైటిస్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. అయితే సినిమాలు చేసిన చేయ‌క‌పోయిన కూడా ఈ భామ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంది. త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలు, […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : అజ్ఞాతంలోకి వెళ్లింద‌నుకున్న అభిమానులు.. స‌మంత అక్క‌డ క‌నిపించే స‌రికి నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత..నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని అతని నుండి విడిపోయిన త‌ర్వాత మ‌యోసైటిస్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుండి సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాల‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. అయితే సినిమాలు చేసిన చేయ‌క‌పోయిన కూడా ఈ భామ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంది. త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోల‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా న‌టించిన ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. ఇదే స‌మ‌యంలో తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే ఓ సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది.

Samantha ఆశ్ర‌మం బాట‌..

గతంలో ఓసారి ఆశ్రమంకి వెళ్లిన సామ్.. మళ్లీ బాట ప‌ట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి సమంత వెళ్ళింది. అక్క‌డ సామ్ మెడిటేషన్ చేస్తున్న పలు ఫొటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారని, మ‌న లైఫ్ కి వెలుగు చూపుతూ, స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌క్తిని క‌నుగొడం అనేది చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భమని ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. మనకు జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలని తెలిపింది. అందుకు కారణం కూడా నిత్య జీవితంలో జరిగే సంఘటనల వల్ల లభిస్తోంది తెలిపింది. ఇది చాలా సులభమని మీరు ఆలోచిస్తున్నారు..కానీ తాను అలా కానే కాదని, జ్ఞానం సంపాదించుకోవ‌డం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.

Samantha అజ్ఞాతంలోకి వెళ్లింద‌నుకున్న అభిమానులు స‌మంత అక్క‌డ క‌నిపించే స‌రికి నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్

Samantha : అజ్ఞాతంలోకి వెళ్లింద‌నుకున్న అభిమానులు.. స‌మంత అక్క‌డ క‌నిపించే స‌రికి నోరెళ్ల‌పెట్టిన ఫ్యాన్స్..!

జ్ఞానం పొంద‌డంమే కాదు, అలా సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడటం కూడా ఎంతో ముఖ్యమంటూ శామ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం స‌మంత పోస్ట్ సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఖుషి చిత్రం తర్వాత సమంత మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌లో నటించి సిటాడెల్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధమైంది. కొంత విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఆమె ప్రకటించారు.. దీనికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’పై రూపొందుతున్న మొదటి చిత్రమిది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియచేస్తామని సామ్‌ ఓ సందర్భంలో చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది