Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత..నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అతని నుండి విడిపోయిన తర్వాత మయోసైటిస్ బారిన పడిన విషయం తెలిసిందే. అప్పటి నుండి సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాలలోకి రీఎంట్రీ ఇస్తుంది. అయితే సినిమాలు చేసిన చేయకపోయిన కూడా ఈ భామ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంది. తనకు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. ఇదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే ఓ సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది.
గతంలో ఓసారి ఆశ్రమంకి వెళ్లిన సామ్.. మళ్లీ బాట పట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి సమంత వెళ్ళింది. అక్కడ సామ్ మెడిటేషన్ చేస్తున్న పలు ఫొటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మనలో చాలామంది గురువు లేదా మెంటార్ కోసం వెతుకుతుంటారని, మన లైఫ్ కి వెలుగు చూపుతూ, సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని కనుగొడం అనేది చాలా ప్రత్యేకమైన సందర్భమని ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది. మనకు జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలని తెలిపింది. అందుకు కారణం కూడా నిత్య జీవితంలో జరిగే సంఘటనల వల్ల లభిస్తోంది తెలిపింది. ఇది చాలా సులభమని మీరు ఆలోచిస్తున్నారు..కానీ తాను అలా కానే కాదని, జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది.
జ్ఞానం పొందడంమే కాదు, అలా సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడటం కూడా ఎంతో ముఖ్యమంటూ శామ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖుషి చిత్రం తర్వాత సమంత మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌లో నటించి సిటాడెల్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. కొంత విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఆమె ప్రకటించారు.. దీనికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’పై రూపొందుతున్న మొదటి చిత్రమిది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియచేస్తామని సామ్ ఓ సందర్భంలో చెప్పారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.