Home » Entertainment » Donations By Samantha Complete Devotional Mood
Entertainment

Samantha : స‌మంత దానాల వెనుక ఇంత ఆంత‌ర్యం ఉందా?

Authored By
Sam C
The Telugu News | Published on: September 16, 2022, 11:00 am
Advertisement

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఈ అమ్మ‌డు నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని స‌జావుగా సంసారం న‌డుపుతున్న స‌మ‌యంలో అనుకోకుండా విడాకులు నిర్ణ‌యం తీసుకొని షాకిచ్చారు.గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు నిర్ణయం తీసుకోగా, ఇప్ప‌టికీ ఈ విడాకుల నిర్ణ‌యం అంద‌రికి షాక్ ఇస్తుంది. ఎందుకు తీసుకున్నారు అనేది అర్ధం కావ‌డం లేదు. స‌మంత మాత్రం త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తుందే త‌ప్ప అస‌లు నిజం చెప్ప‌డం లేదు. నాగ చైత‌న్య కూడా ఇంత వ‌ర‌కు విడాకుల నిర్ణ‌యంపై నోరు విప్ప‌లేదు. రీసెంట్‌గా నాగార్జున కూడా వీరి విడాకుల నిర్ణ‌యంపై షాకింగ్ స‌మాధానం ఇచ్చాడు.

Advertisement

Samantha : ఎందుకిలా ?

స‌మంత ప్ర‌స్తుతం త‌న కెరీర్‌లో దూసుకుపోతుంది. వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తుంది. తెలుగులోనే కాక ఇత‌ర భాష‌ల‌లోను స‌త్తా చాటుతూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంది. అయితే విడాకుల త‌ర్వాత సమంత అనేక ఆశ్రమాలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఒక ఆశ్రమంలో సమంత ఈమధ్య ఒక హోమంలో పాల్గోన్నట్లుగా వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి. వాస్తవానికి సమంత క్రిష్టియన్ నాగచైతన్యతో పెళ్ళి జరిగినప్పుడు హిందూ క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం వారిద్దరి పెళ్ళి రెండుసార్లు జరిగింది. చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత హిందూ ధ‌ర్మాల‌ని పాటిస్తుంది.

Donations by Samantha complete devotional mood

Advertisement

ఆలయాలకు వెళ్ళడం వల్ల మనశ్శాంతి కలిగి తాను ఏమిటో తనకు అర్థం అయ్యేలా ఉంది అంటూ ఆమధ్య ఆమె కామెంట్స్ చేసింది. ఇక సమంత హైదరాబాద్ లోని కొన్ని ఆశ్రమాలకు భారీ విరాళాలు ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్రిష్టియన్ సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందూ మతం పై ఆలయాల పై ఆశ్రమాల పై సమంతకు పెరిగిపోతున్న ఆశక్తి వెనుక ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. అది ఏంట‌నే దానిపై పూర్తి క్లారిటీ రావ‌డం లేదు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి