Hyper Aadi : హైపర్ ఆది వల్ల ఆ స్టార్‌ హీరో సినిమాకు రూ.5 కోట్ల అదనపు బిజినెస్‌

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: February 18, 2023, 10:00 am

Hyper Aadi : సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ కారణంగా ఆ సినిమా బిజినెస్ జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్నో రకాలుగా తెలుగు సినిమా మరియు ఇతర భాషల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో కొందరు కమెడియన్స్ నటిస్తే ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూనే ఉంటాం, కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెడితే ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా సార్ సినిమాలో హైపర్ ఆది ఉండడం వల్ల తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అంతే కాకుండా ధనుష్ సినిమా గతంలో చేసిన బిజినెస్ కంటే ఈసారి దాదాపు 10 కోట్ల రూపాయలను అదనంగా బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

due to hyper aadi in dhanush sir movie the business increase

due to hyper aadi in dhanush sir movie the business increase

తెలుగు దర్శకుడు మరియు తెలుగు నిర్మాత అవడం వల్ల ఐదు కోట్ల బిజినెస్ చేసి ఉండవచ్చు, మరో ఐదు కోట్ల రూపాయలు మాత్రం కచ్చితంగా హైపర్ ఆది ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర కార్యక్రమం జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హైపర్ ఆది ఇప్పటికి కూడా అదే జోష్ తో ముందుకు దూసుకు పోతున్నాడు. ఒక వైపు బుల్లి తెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండి తెరపై అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

Hyper Aadi: అలాంటి అందమైన టీచరే సంయుక్త.. హైపర్ ఆది పంచ్‌లకు ధనుష్ ఫిదా! - hyper  aadi special attraction in dhanush sir trailer launch event - Samayam Telugu

ధనుష్ తాజాగా సార్ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై హైపర్ ఆది యొక్క క్రేజ్ చూసి ఆశ్చర్య పోయాడు. సినిమాల్లో ఎక్కువ నటించకుండా ఇంత క్రేజ్‌ ఏంటో అంటూ ధనుష్ ఆశ్చర్య పోయాడు. అంతే కాకుండా హైపర్ ఆది గురించి తెలిసి జబర్దస్త్ కార్యక్రమం ఎపిసోడ్స్‌ అన్నింటిని చూస్తానంటూ హైపర్ ఆదికి ధనుష్ హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి సార్ సినిమా సక్సెస్ అయితే అందులో హైపర్ ఆది యొక్క క్రెడిట్ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp