
due to hyper aadi in dhanush sir movie the business increase
Hyper Aadi : సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ కారణంగా ఆ సినిమా బిజినెస్ జరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఎన్నో రకాలుగా తెలుగు సినిమా మరియు ఇతర భాషల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కొన్ని సినిమాల్లో కొందరు కమెడియన్స్ నటిస్తే ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూనే ఉంటాం, కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెడితే ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా సార్ సినిమాలో హైపర్ ఆది ఉండడం వల్ల తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అంతే కాకుండా ధనుష్ సినిమా గతంలో చేసిన బిజినెస్ కంటే ఈసారి దాదాపు 10 కోట్ల రూపాయలను అదనంగా బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.
due to hyper aadi in dhanush sir movie the business increase
తెలుగు దర్శకుడు మరియు తెలుగు నిర్మాత అవడం వల్ల ఐదు కోట్ల బిజినెస్ చేసి ఉండవచ్చు, మరో ఐదు కోట్ల రూపాయలు మాత్రం కచ్చితంగా హైపర్ ఆది ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర కార్యక్రమం జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హైపర్ ఆది ఇప్పటికి కూడా అదే జోష్ తో ముందుకు దూసుకు పోతున్నాడు. ఒక వైపు బుల్లి తెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండి తెరపై అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు.
ధనుష్ తాజాగా సార్ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై హైపర్ ఆది యొక్క క్రేజ్ చూసి ఆశ్చర్య పోయాడు. సినిమాల్లో ఎక్కువ నటించకుండా ఇంత క్రేజ్ ఏంటో అంటూ ధనుష్ ఆశ్చర్య పోయాడు. అంతే కాకుండా హైపర్ ఆది గురించి తెలిసి జబర్దస్త్ కార్యక్రమం ఎపిసోడ్స్ అన్నింటిని చూస్తానంటూ హైపర్ ఆదికి ధనుష్ హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. మొత్తానికి సార్ సినిమా సక్సెస్ అయితే అందులో హైపర్ ఆది యొక్క క్రెడిట్ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
This website uses cookies.