
Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే కాదు యావత్ చిత్రసీమను షాక్ కు గురి చేస్తుంది. మహేష్ లాంటి స్టార్ హీరో అదికాక చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ లు చేస్తూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఆయన కు నోటీసులు ఇవ్వడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. అసలు కథ ఏంటి అంటే.. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్‌లపై ఈడీ చేపట్టిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. మహేష్ బాబు ఈ సంస్థల పబ్లిసిటీకి భాగస్వామిగా ఉన్నందుకే ఆయనకు రూ.5.9 కోట్లు చెల్లించారని ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగా రూ. 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లింపులు జరిగినట్టు సమాచారం.
Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్
ఈ నగదు చెల్లింపులు మనీ లాండరింగ్‌కు సంబంధించినవా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ విచారణను వేగంగా కొనసాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా లాంటి వారు అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు అమ్మడం, ఒకే ప్లాట్‌ను పలువురికి విక్రయించడం వంటి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలపై దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు డబ్బు చెల్లింపులపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో మహేష్ బాబు ప్రత్యక్షంగా మోసాలకు పాల్పడలేదన్న అభిప్రాయమే ఉన్నప్పటికీ, ఆయనకు చెల్లించిన డబ్బు యొక్క మూలం, లావాదేవీల పద్ధతులపై ఈడీ ఆరా తీస్తోంది. ప్రచార ప్రభావంతో ప్రజలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో మహేష్ బాబును కూడా విచారణకు పిలిపించడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.