Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2025,12:00 pm

Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే కాదు యావత్ చిత్రసీమను షాక్ కు గురి చేస్తుంది. మహేష్ లాంటి స్టార్ హీరో అదికాక చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ లు చేస్తూ ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన ఆయన కు నోటీసులు ఇవ్వడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. అసలు కథ ఏంటి అంటే.. సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్‌లపై ఈడీ చేపట్టిన సోదాల నేపథ్యంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. మహేష్ బాబు ఈ సంస్థల పబ్లిసిటీకి భాగస్వామిగా ఉన్నందుకే ఆయనకు రూ.5.9 కోట్లు చెల్లించారని ఈడీ గుర్తించింది. ఇందులో భాగంగా రూ. 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లింపులు జరిగినట్టు సమాచారం.

Mahesh Babu ED notices మహేష్ బాబుకు ఈడీ నోటీసులుఎందుకు ఏ తప్పు చేసాడు షాక్ లో ఫ్యాన్స్

Mahesh Babu ED notices : మహేష్ బాబుకు ఈడీ నోటీసులు..ఎందుకు..? ఏ తప్పు చేసాడు..? షాక్ లో ఫ్యాన్స్ 

Mahesh Babu ED notices నగదు లావాదేవీలపై ఈడీ దర్యాప్తు

ఈ నగదు చెల్లింపులు మనీ లాండరింగ్‌కు సంబంధించినవా అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ విచారణను వేగంగా కొనసాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా లాంటి వారు అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు అమ్మడం, ఒకే ప్లాట్‌ను పలువురికి విక్రయించడం వంటి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలపై దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు డబ్బు చెల్లింపులపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Mahesh Babu ED notices మహేష్ ప్రమేయం లేనప్పటికీ విచారణ

ఈ వ్యవహారంలో మహేష్ బాబు ప్రత్యక్షంగా మోసాలకు పాల్పడలేదన్న అభిప్రాయమే ఉన్నప్పటికీ, ఆయనకు చెల్లించిన డబ్బు యొక్క మూలం, లావాదేవీల పద్ధతులపై ఈడీ ఆరా తీస్తోంది. ప్రచార ప్రభావంతో ప్రజలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో మహేష్ బాబును కూడా విచారణకు పిలిపించడం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది